Moviesజూనియ‌ర్ ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ కావాలంటోన్న క్రేజీ హీరోయిన్‌… ఆంటీకి ఇంత పిచ్చేంట్రా...

జూనియ‌ర్ ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ కావాలంటోన్న క్రేజీ హీరోయిన్‌… ఆంటీకి ఇంత పిచ్చేంట్రా బాబు..!

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా పరిచ‌యం అవసరం లేదు. నూనుగు మీసాల వయసులోనే తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యి 21 సంవత్సరాల వయసుకే స్టూడెంట్ నెంబర్ 1న్, ఆది, సింహాద్రి లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలతో టాప్ లేపాడు. అప్పట్లో జూనియర్ ఎన్టీఆర్ అంటే దశాబ్దాల అనుభవం ఉన్న టాలీవుడ్ స్టార్ హీరోలు సైతం వణికి పోయేవారు. ఆ తర్వాత మధ్యలో వరుస ప్లాప్‌లతో కాస్త రేస్‌లో వెనుకబడిన టెంపర్ సినిమా నుంచి త్రిబుల్ ఆర్ సినిమా వరకు వరుసగా 6 సూపర్ డూపర్ హిట్లతో తిరుగులేని ఫామ్ తో దూసుకుపోతున్నాడు.

ఎన్టీఆర్‌కు సినీ సెలబ్రిటీలలో కూడా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఎన్టీఆర్ నటన, డైలాగ్ డెలివరీ ఎనర్జీ, డ్యాన్సులు ఇష్టపడే నటులు, నటిమణులు ఎంతోమంది ఉన్నారు. ఎన్టీఆర్‌ను అమితంగా ఇష్టపడే సెలబ్రిటీస్ లో కోలివుడ్‌ కుష్బూ కూడా ఒకరు. కుష్బూ తమిళ హీరోయిన్ అయినా తెలుగులో కూడా ఎన్నో సినిమాలలో నటించింది. తమిళనాడులో అప్పట్లో కుష్బూని అభిమానించే ఆమె అభిమానులు ఏకంగా గుళ్ళు కట్టి పూజలు చేశారు. అంటే కుష్బూ అంటే తమిళ జనాలకు ఎంత పిచ్చో అర్థమవుతుంది.

అంత పెద్ద స్టార్ హీరోయిన్ కి ఎన్టీఆర్ అంటే విపరీతమైన అభిమానం ఆట.. ఎన్నో ఇంటర్వ్యూలలో ఇదే విషయాన్ని చెప్పిన కుష్బూ తాజాగా ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ తీసుకోవడం నా చిరకాల కోరిక అంటూ చెప్పటం పెద్ద సెన్సేషన్ అయింది. ఆమె ఎంతోమంది స్టార్లతో కలిసి నటించిన ఎన్టీఆర్ మీద ఇష్టంతో ఎన్టీఆర్ ఆటోగ్రాఫ్ కోసం ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చూస్తే ఎన్టీఆర్ పట్ల ఆమె ఎంత అభిమానంతో ఉందో తెలుస్తోంది. మరి ఎన్టీఆర్ తన సినిమాలో కుష్బూకు అత్తా లేదా అమ్మ పాత్రలు అవకాశం ఇప్పిస్తాడేమో చూడాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news