Moviesసినిమా ఫ్లాప్ అయితే హీరోలు హీరోయిన్స్ తో అలా చేస్తారా..? సంచలన...

సినిమా ఫ్లాప్ అయితే హీరోలు హీరోయిన్స్ తో అలా చేస్తారా..? సంచలన విషయాని బయటపెట్టిన తాప్సీ..!

ఈ మధ్యకాలంలో సినిమా ఇండస్ట్రీలో పరిస్థితులు ఎలా మారిపోతున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కోట్లు ఖర్చుపెట్టి భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన సినిమాలు అన్ని బాక్స్ ఆఫీస్ వద్ద తుస్సు మంటూ ప్లాప్ అవుతున్నాయి .ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా సాదాసీదాగా రిలీజ్ అయిన సినిమాలు సూపర్ డూపర్ హిట్ అవుతున్నాయి. ఇలాంటి క్రమంలోనే సినిమా ఫ్లాప్ అయితే ఆ నిందలను హీరోయిన్స్ పై తోసేస్తున్నారు అని.. హిట్ అయితే మాత్రం హీరోల కష్టంతోనే హిట్ అయింది అని చెప్పుకొస్తున్నారు అని సంచలన కామెంట్స్ చేసింది హీరోయిన్ తాప్సి .

ఝుమ్మంది నాదం అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమకు హీరోయిన్గా పరిచయమైన తాప్సి .. ప్రజెంట్ బాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ స్థానాన్ని ఎంజాయ్ చేస్తుంది. రీసెంట్గా తాప్సి ఏలియన్ అనే తమిళ్ చిత్రంలో నటిస్తుంది . కాగా ఇటీవల ఈ సినిమాకి సంబంధించిన ఈవెంట్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ తాప్సీ బోల్డ్ కామెంట్స్ చేసింది . “సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ పాత్ర చాలా టఫ్ గా ఉంటుంది ..సినిమా హిట్ అయితే అక్కడ క్రెడిట్ మొత్తం తీసుకెళ్లి హీరో ఖాతాలో వేస్తారు..ఫ్లాప్ అయితే హీరోయిన్ పై నెట్టేస్తారు. ఇప్పటివరకు మనం చూసుకున్నట్లైతే ఏ సినిమాలో అయినా సరే ఏ సినిమా ప్లాప్ అయినా దాన్ని తాలూకా రిజల్ట్ మొత్తం హీరోయిన్ల పైన నెట్టేస్తారు” అంటూ తన ఆవేదన వ్యక్తం చేసింది .

అంతేకాదు నిజానికి కొందరు స్టార్ హీరోలు కూడా హీరోయిన్లు ఫ్లాప్ అయితే తర్వాత సినిమాల్లో ఆ హీరోయిన్ ని ఆ హీరోలు తీసుకోరని ..దూరం పెట్టేస్తూ ఉంటారని చెప్పుకు వచ్చింది . అంతేకాదు ఓ సినిమా హిట్ అయిన ఫ్లాప్ అయిన దానికి కారణం ఏదైనా ఆయన బాధపడేది మాత్రం హీరోయిన్ అంటూ బోల్డ్ గా స్పందించింది . దీంతో ఒకవేళ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ సక్సెస్ కాకపోతే హీరోలు ఈ విధంగా చేస్తారా..? వారిని దూరం పెట్టేస్తారా అంటూ జనాల సైతం షాక్ అయిపోతున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news