Newsసమంత కంటే ముందే నాగచైతన్య భార్య కావాల్సిన ఆ స్టార్ డాటర్.....

సమంత కంటే ముందే నాగచైతన్య భార్య కావాల్సిన ఆ స్టార్ డాటర్.. అంత అనుకున్నాక లాస్ట్ లో క్యాన్సిల్..ఎందుకంటే..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరో నాగచైతన్యకు హీరోయిన్ సమంతకు ఎలాంటి క్రేజీ స్థానాలు ఉన్నాయో మనకు బాగా తెలిసిన విషయమే. వీళ్ళిద్దరూ కలిసి ఏం మాయ చేసావే అనే సినిమాలో నటించారు . తెరపై వీళ్ల కెమిస్ట్రీ బాగా బాగా పండింది .. ఎంతలా అంటే వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకుంటే చూడాలి అంటూ అభిమానులు ఆశపడ్డారు . అయితే ఆ విషయాన్ని నిజం చేస్తూ సమంత నాగచైతన్య పెళ్లి చేసుకున్నారు . పెళ్లి తర్వాత మూడేళ్ల కాపురం బాగానే సాగింది .

అయితే ఆ తర్వాత ఏమైందో ఏమో తెలియదు కానీ విడాకులు తీసుకున్నారు. ఇప్పుడు ఎవరి దారి వాళ్లది అంటూ బ్రతుకుతున్నారు. అయితే నాగచైతన్య సమంత కంటే ముందే ఓ అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి ఉంది అని.. కానీ సమంత ని ఆయన ప్రేమిస్తున్న కారణంగా ఆ సంబంధాన్ని రిజెక్ట్ చేశాడట. సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా ఉన్న హీరో తన కూతుర్ని నాగచైతన్యకు ఇవ్వాలనుకున్నారట .

అక్కినేని కుటుంబంతో మంచి రాపో ఉండడంతో ఆ హీరో కూడా అక్కినేని నాగచైతన్య ని ఇంటి అల్లుడు గా చేసుకోవాలని భావించారట . నాగార్జున సైతం దీనికి ఎస్ చెప్పారట . కానీ అప్పుడే సమంతతో ప్రేమ విషయాన్ని చైతన్య ఓపెన్ అప్ అయ్యారు. దీంతో ఆ హీరో తన కూతుర్ని వేరే వ్యక్తికి పెళ్లి చేశాడు . అలా నాగచైతన్య భార్య కావాల్సిన ఆమె మరొక ఇంటికి కోడలుగా వెళ్ళింది . సమంత అక్కినేని ఇంటికి కోడలు గా వెళ్లి మళ్లీ ఆ ఇంటి నుండి బయటకు వచ్చేసింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news