Moviesఎన్టీఆర్ తో సినిమా ఛాన్స్ వస్తే..ఏడుసార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఈమె.....

ఎన్టీఆర్ తో సినిమా ఛాన్స్ వస్తే..ఏడుసార్లు రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఈమె.. ఎంత అన్ లక్కి అంటే..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు . నందమూరి నట వారసుడిగా ఇండస్ట్రీ లోకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని చాలామంది పెద్దపెద్ద నటులే ఈగర్ గా వెయిట్ చేస్తూ ఉంటారు . అలాంటి ఛాన్స్ వస్తే అసలు మిస్ చేయరు. అయితే అలాంటి ఛాన్స్ వచ్చినా సరే ఓ హీరోయిన్ మిస్ చేసుకుంది . ఒకటి రెండు సార్లు కాదు ఏకంగా ఏడు సినిమాల్లో ఆమె ఛాన్స్ మిస్ చేసుకునింది. ఆ హీరోయిన్ మరెవరో కాదు అందాల ముద్దుగుమ్మ అనుష్క శెట్టి .

ఎస్ అనుష్క ఎన్టీఆర్ కాంబోలో దాదాపు 7 సినిమాలు రావాల్సి ఉన్నాయి . అయితే ఏడు సినిమాలను అనుష్క రిజెక్ట్ చేయడం గమనార్హం. దానికి కారణం ఎన్టీఆర్ బొద్దుగా ఉండడమే . మనకు తెలిసిందే కెరియర్ స్టార్టింగ్ లో ఎన్టీఆర్ చాలా బొద్దుగా ఉండేవాడు. అయినా సరే నటన పరంగా..డ్యాన్స్ పరంగా ఎక్కడ వెనకడుగు వేసే వాడే కాదు . కానీ అప్పట్లో కొందరు హీరోయిన్స్ ఆయన బొద్దుగా ఉన్నారని ఆయన పక్కన నటించడానికి ఆలోచించే వాళ్ళు .

ఆ లిస్టులో అనుష్క కూడా వస్తుందట . ఆమె వద్దకు వచ్చి డైరెక్టర్ లు ఎన్టీఆర్ హీరో అనగానే నో అని రిజెక్ట్ చేసేదట. అలా ఆమె ఎన్టీఆర్ తో నటించే ఏడు సినిమాలను మిస్ చేసుకున్నింది. అయితే ఫైనల్లీ వెయిట్ తగ్గిన తర్వాత ఎన్టీఆర్ తో అనుష్క సినిమా చేయాలి అనుకున్న మేకర్స్ ..ఎన్టీఆర్ రేంజ్కి అనుష్క సరిపోదు అంటూ ఆమెను దూరం పెట్టేసారట . అలా వీళ్ల కాంబోలో ఒక్క సినిమా రాలేదు . చింతకాయల రవి సినిమాలో ఎన్టీఆర్ అనుష్క కలిసి రెండే రెండు నిమిషాలు ఓ పాటలో కనిపిస్తారు అంతే . చూడాలి మరి ఫ్యూచర్లో వీళ్ళ కాంబో సెట్ అవుతుందో లేదో..?

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news