టాలీవుడ్ సీనియర్ హీరో అక్కినేని నాగార్జున గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు నట వారసుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టిన నాగార్జున తర్వాత టాలీవుడ్ లోనే స్టార్ హీరోగా భారీ క్రేజ్ ను అందుకున్నాడు. నాగార్జున సినిమాల్లో రాణిస్తున్న సమయంలోనే మరో లెజెండ్రి నిర్మాత దగ్గుబాటి రామానాయుడు కూతురు లక్ష్మిని వివాహం చేసుకున్నాడు.
ఇక వీరిద్దరి పెద్దలు కుదిర్చిన వివాహం వీరికి ఒక అబ్బాయి జన్మించాక కొన్ని రోజులకు వారి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకుని విడిపోయారు. ఆ తర్వాత నాగార్జున తనతో పాటు సినిమాలో నటించిన మరో హీరోయిన్ అమలని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఇక వీరికి ఒక బాబు కూడా జన్మించాడు. ఇక నాగార్జున ఎప్పుడు సినిమాల్లో బిజీగా ఉండేవాడు. ఇక ఓ సినిమా షూటింగ్ సమయంలో అక్కినేని నాగేశ్వరరావు, నాగార్జునని వివాహం చేసుకోమని ఎందరో అమ్మయిల ఫోటోలను చూపించాడట. ల చూపించిన వారిలో ఒకప్పటి హీరోయిన్ కూడా ఉంది.
ఆ హీరోయిన్ మరెవరో కాదు సుమలత. నాగార్జునని పెళ్లి చేసుకోమని టైంలో నాగేశ్వరరావు హీరోయిన్ సుమలతతో నువ్వు చాలా లక్షణంగా, అందంగా, ఉన్నావు నీ హైట్ కి తగ్గ కుర్రాడు విదేశాల్లో ఉన్నాడు పెళ్లి చేసుకుంటావా..? మీ పెద్దలతో నేను మాట్లాడతానని నాగేశ్వరరావు సరదాగా అన్నాడట. అక్కినేని నాగేశ్వరరావు లాంటి హీరో అలా అనడంతో సుమలత ఏమి అనాలో తెలియక అబ్బాయి ఎవరు అని అడిగిందట.
ఇక దానికి సమాధానంగా నాగేశ్వరరావు నా కొడుకు నాగార్జున అని చెప్పారట. ఇక సుమలతకు ఏం సమాధానం చెప్పాలో తెలియక అక్కడి నుంచి వెళ్లిపోయిందట. ఇదే విషయాన్ని స్వయంగా సుమలత ఓ ఇంటర్వ్యూలో భాగంగా చెప్పుకొచ్చింది. ఈ చర్చ జరిగినప్పుడు నాగార్జునకు ఇంకా వివాహం జరగలేదట. టాలీవుడ్ లో కూడా హీరోగా ఎంట్రీ ఇవ్వలేదట నాగ్ కాగా వీరిద్దరూ కలిసి హీరో హీరోయిన్లగా ఒక్క సినిమాలో కూడా నటించలేదు.