Moviesసెల్వమణిని లొంగదీసుకోవాలని చూసిన స్టార్ హీరోయిన్.. తిక్క రేగిన రోజా ఏం...

సెల్వమణిని లొంగదీసుకోవాలని చూసిన స్టార్ హీరోయిన్.. తిక్క రేగిన రోజా ఏం చేసిందో తెలుసా.. ఫైర్ బ్రాండ్ అంటే ఇదే..!!

సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్ రోజా కి ఎలాంటి స్థానం ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తన అందం తన నటనతో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకుంది. రాజకీయాల్లోకి వచ్చాక కొందరు శత్రువులు ఎక్కువయ్యారే కానీ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా ఉన్న అన్ని నాళ్ళు రోజా మకుటం లేని మహారాణిగా ఎలేసింది . కాగా డైరెక్టర్ సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకున్న రోజా ఇద్దరు పిల్లలతో లైఫ్ ను చక్కగా డీల్ చేస్తూ ముందుకు వెళుతుంది . కాగా రోజా భర్త సెల్వమణి ని ఓ హీరోయిన్ వలలో వేసుకోవాలి అనుకున్నింది అన్న న్యూస్ అప్పట్లో వైరల్ గా మారింది .

ఎస్ ఇదే న్యూస్ తెలుసుకొని రోజా సైతం మండిపడిపోయిందట . ఆ హీరోయిన్ కి ఎడాపెడా తిట్టి మరి వార్నింగ్ ఇచ్చిందట . ఆ హీరోయిన్ మరెవరో కాదు సిల్క్ స్మిత . ఇండస్ట్రీలో చాలామంది మగాళ్లను తన అంద చందాలతో కట్టిపడేసిన సిల్క్ స్మిత గురించి ఎంత చెప్పుకున్న తక్కువే . కోలీవుడ్ డైరెక్టర్ సెల్వమణితో రోజా ప్రేమలో ఉన్న సమయంలో రాజా ముత్తురాజ్ అనే సినిమాలో రోజా హీరోయిన్ గా చేసింది. ఈ సినిమాలో హీరోగా నెపోలియన్ చేశారు .ఇందులో ఐటెం సాంగ్ కోసం సిల్క్ స్మితాన్ని తీసుకున్నారు.

అప్పట్లో షూటింగ్లో డైరెక్టర్ సెల్వమణితో చాలా క్లోజ్ గా ప్రవర్తించిందట సిల్క్ స్మిత . అప్పటికే రోజా సెల్వమణి ప్రేమించుకుంటున్నారు అన్న విషయం ఆమెకు తెలియదు. ఈ క్రమంలోని సిల్క్ స్మిత ప్రవర్తన చూసి మండిపోయిన రోజా తన బాయ్ ఫ్రెండ్ ని ఎక్కడ ఎగరేసుకుపోతుందో అన్న భయంతో కొట్టి మరీ వార్నింగ్ ఇచ్చిందట. మొదటి నుంచి రోజా రఫ్ అండ్ టఫ్ అని తెలిసిందే . ఇక ప్రేమించిన అబ్బాయి జోలికి వస్తే ఊరుకుంటుందా ..? దెబ్బకి దడదడలాడించేసింది . షూటింగ్ లొకేషన్లోనే ఎడాపెడా తిట్టేసింది . సిల్క్ స్మిత అలాంటిది ఏదీ లేదు నేను ఫ్రెండ్ గానే మూవ్ అయ్యాను అంటూ చెప్పుకొచ్చిందట . ఈ విషయం అప్పట్లో చాలా ఎక్కువగా సంచలనంగా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news