టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ ఇటీవల వరుస డిజాస్టర్లతో ఫ్యాన్స్ ను బాగా నిరాశ పరుస్తున్నాడు. రవితేజ నటించిన నాలుగైదు సినిమాలకు ఒక హిట్ మాత్రమే వస్తోంది. క్రాక్ సినిమా తర్వాత మళ్లీ ధమాకా సినిమాతో మాత్రమే రవితేజకు హిట్టు వచ్చింది. ఇక చిరంజీవికి జోడిగా నటించిన వాల్తేరు వీరయ్య కూడా సక్సెస్ అయింది. గత పది సినిమాలలో రవితేజకు కమర్షియల్ గా రెండు హిట్లు మాత్రమే దక్కాయి.
ఇక ఈ ఏడాది వాల్తేరు వీరయ్య తర్వాత రవితేజ రావణాసుర సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాగా ఈ సినిమా డిజాస్టర్ అయ్యింది. ఇక ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు అనే పీరియడ్ డ్రామాతో ప్రేక్షకులు ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా గుంటూరు జిల్లా బాపట్ల సమీపంలోని స్టూవర్ట్‌పురం గ్రామానికి చెందిన ఒక బందిపోటు దొంగ కథ ఆధారంగా తెరకెక్కుతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే.
ఇటీవల విడుదల చేసిన టీజర్ కి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. కచ్చితంగా పాన్ ఇండియా లెవెల్లో ఈ సినిమా దుమ్ము లేపుతుందన్న చర్చలు అయితే ట్రేడ్ వర్గాల్లో నడుస్తున్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమాను ముందు యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తో చేయాలని అనుకున్నారట.
ఇప్పుడు రవితేజ సినిమా కోసం పెట్టిన బడ్జెట్ కంటే రెండేంతలు ఎక్కువ బడ్జెట్ పెట్టి చాలా గ్రాండ్గా చేయాలని అనుకున్నాడట నిర్మాత అభిషేక్ అగర్వాల్. అయితే ప్రభాస్ మరో నాలుగేళ్ల పాటు నా డేట్లు మొత్తం బ్లాక్ అయ్యాయి అని చెప్పడంతో చివరకు రవితేజతో అప్రోచ్ చెయ్యి రవితేజ హీరోగా ఈ సినిమాను తెరకెక్కించారు.