ఇటీవల కాలంలో తరచుగా మీడియాలో చర్చనీయాంశంగా మారిన నటుడు సుధాకర్. ఆయన గురించి.. అనేక వార్తలు వస్తున్నాయి. అయితే.. వాటికి ఆయన వివరణ కూడా ఇస్తున్నారు. ఇదిలావుంటే.. సుధాకర్ ను చాలా కమెడియన్ అనుకుంటారు. కానీ, వాస్తవానికి సుధాకర్ తెలుగు తెరకు హీరోగా పరిచయం అయ్యారు. ఈ విషయం చాలా తక్కువ మందికే తెలుసు. అయితే.. ఆ సినిమా బయటకు రాలేదు.
తర్వాత.. సుధాకర్‌కు వచ్చిన ఆఫర్లలో కీలకమైంది.. విలనీ పాత్ర. రెండు మూడు సినిమాల్లో సుధాకర్ విలన్ పాత్రలు పోషించారు. అక్కినేని నాగార్జున తొలినాళ్లలో నటించి.. శత దినోత్సవం కూడా చేసుకున్న చిత్రం.. మజ్ను. ఈ సినిమాలో సుధాకర్ విలన్ పాత్ర పోషించారు. అదేవిధంగా విక్టరీ వెంకటేష్ తొలినాళ్లలో నటించిన సినిమాలో కూడా సుధాకర్ సైడ్ విలనీ పాత్ర పోషించారు.
ఇలా.. సుధాకర్ హీరో అవ్వాలని వచ్చి.. విలన్ అయ్యారు. అయితే. కొన్నాళ్లకు ఆయనను ఇండస్ట్రీ పక్కన పెట్టింది. పొట్టిగా ఉన్నాడనే కారణంగా.. కొందరు దర్శకులు ఆయనను హీరోగాను, విలన్‌గా కూడా తీసుకో లేదు. ఈక్రమంలోనే సుధాకర్ ఇబ్బందులు పడ్డారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి.. ముందు ఖాళీగా ఉండకు. ఏదో ఒకటి చేస్తూ.. ఉండు అని ప్రోత్సహించారు. ఇలా.. సుధాకర్ క్యారెక్టర్ పాత్రలు పోషించారు.
తర్వాత ప్రముఖ దర్శకుడు వంశీ పరిచయంతో ఆయన కామెడీపాత్రలు వేయడం ప్రారంభించారు. ఇవి బాగా కలిసి వచ్చాయి. తర్వాత వెను దిరిగిచూసుకోలేదు. బాగానే బిజీఅయిపోయారు. అయితే.. ప్రతిఒక్కరికీ ఏదోఒక వీక్‌నెస్ ఉన్నట్టుగానే.. సుధాకర్‌కు కార్డ్స్ వీక్‌నెస్ ఉంది. ఇది ఆయన ఆస్తిని కరిగించేసింది. ఇప్పుడు ఇబ్బందుల్లో పడడానికి అదే కారణమని ఆయన సన్నిహితులు లోలోన బాధపడుతుంటారు.