పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సాయిధరంతేజ్ హీరోలుగా నటించిన బ్రో సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో పాటలపై భారీ ఎత్తున విమర్శలు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా రిలీజ్ కి ముందు లిరికల్ వీడియోస్ రిలీజ్ చేస్తున్న టైం నుంచే సాంగ్స్ ఏ మాత్రం బాగోలేదని పవన్ అభిమానులే పెదవిరిచారు. ఇక సినిమా ధియేటర్లలోకి వచ్చాక ఆ విమర్శలు మరింత పెరిగాయి
అయితే మ్యూజిక్ డైరెక్టర్ థమన్ పై విమర్శలు ఎక్కువ అవడంతో ఆ సినిమా సైజుకు.. థీమ్ కు సాంగ్స్ అలాగే ఉంటాయని అంతకుమించి ఆ కథ డిమాండ్ చేయలేదంటూ అప్పట్లో థమన్ సమర్ధించుకున్నాడు. అయితే ఇప్పుడు పవన్ అభిమానులు ఏకేస్తూ ఉండడంతో పాటల విషయంలో తాను ఫెయిల్ అయినట్టు అంగీకరించాడు. బ్రో సినిమాకు థీం చాలా ఇంపార్టెంట్.. అందుకే ఈ సినిమాను కమర్షియల్ గా చూడలేకపోయాను.. పాటల విషయంలో నేను ఫెయిల్ అయి ఉండవచ్చు.. సినిమాలో పవన్ కళ్యాణ్‌ను ఓ దేవుడిలా చూశాను.. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చాలా బాగా చేస్తాననే విషయం నాకు తెలుసు.. అంటూ పాటల విషయంలో తాను ఫెయిల్ అయిన విషయాన్ని పరోక్షంగా అంగీకరించాడు.
విచిత్రం ఏమిటంటే బ్రో సక్సెస్ మీట్ లోనే థమన్ ఈ విషయం చెప్పటం గమనార్హం. ఇక్కడ త్రివిక్రమ్‌ను థమన్ ఆకాశానికి ఎత్తేయటం కోసం మెరుపు. నా ధైర్యం, నా బలం, నా భయం అన్ని త్రివిక్రమ్ ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటానని చెప్పాడు. కేవలం త్రివిక్రమ్ వల్లే వరుసగా పవన్ కళ్యాణ్ నటించిన అన్ని సినిమాలకు తాను మ్యూజిక్ ఇస్తున్నానని కూడా చెప్పాడు.
ఇదిలా ఉంటే సినిమా థియేటర్లలో రన్ అవుతోన్న టైంలో పాటలు ఫెయిల్ అయ్యాయన్న కోణంలో థమన్ మాట్లాడడంతో పవన్ అభిమానులు థమన్‌పై తిట్లతో విరుచుకు పడుతున్నారు. చెత్త.. నా డ్యాష్ అంటూ సోషల్ మీడియాలో రాయలేని పదాలతో తిట్టిపోస్తున్నారు.