సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన కెరీర్లో ఎంతోమంది హీరోయిన్లతో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలలో నటించారు. 1980లలో శ్రీదేవి, శ్రీవిద్య లాంటి హీరోయిన్లతో మొదలుపెట్టి ఆ తర్వాత తరంలో నగ్మా, మీనా, రమ్యకృష్ణ ఆ తర్వాత నయనతార, శ్రీయ ఇక ఇప్పుడు తమన్నా, రాధిక ఆప్టే లాంటి హీరోయిన్లతో కూడా జోడి కట్టిన ఘనత రజనీకాంత్ సొంతం.
రజనీకాంత్ – శ్రీదేవి కాంబినేషన్లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలు వచ్చాయి. వీరిద్దరి జోడి అప్పట్లో తమిళనాట తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. వీరిద్దరూ తెరమీద కనిపించారు అంటే చాలు థియేటర్లు హోరెత్తిపోయేవి. రజనీ పెళ్లికి ముందు శ్రీదేవి ఇంటికి తరచూ వెళ్లేవారట. అప్పటికే శ్రీదేవి – కమలహాసన్ ప్రేమలో పడి మోసపోయింది.
కమలహాసన్ తనకు హ్యాండ్ ఇవ్వడంతో రజనీని ఆమె గుడ్డిగా నమ్మేసి తన ఇంటికి తరచూ వస్తుండడంతో ప్రేమలో పడిపోయింది. రజిని తనను కచ్చితంగా పెళ్లి చేసుకుంటాడని ఆమె ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఒకరోజు రజనీని పెళ్లి చేసుకోమని శ్రీదేవి ప్రపోజల్ పెట్టగా.. రజనీకాంత్ మాత్రం నీ మీద నాకు ఆ ఉద్దేశం లేదు మీ చెల్లిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడట.
వెంటనే శ్రీదేవికి పట్టరాని కోసం, బాధ వచ్చేసింది. రజిని తనతో స్నేహంగా ఉంటూ తన చెల్లిని ఎలా ? పెళ్లి చేసుకుంటాడు అంటూ మండిపడిందట. అప్పటి నుంచి రజినీని.. శ్రీదేవి దూరం పెట్టేసింది అని అప్పట్లో తమిళనాడు మీడియా కొడై కూసింది. అప్పటినుంచి వారిద్దరి మధ్య జాబ్ పెరిగిపోయిందని సినీ జనాలు చెవులు కోరుక్కుంటూ ఉంటారు.