టాలీవుడ్ లో సీనియర్ ఎన్టీఆర్ అంటే దేవుడిలా కొలిచేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఇంకా చెప్పాలంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలు ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ ఒక దేవుడు.. ఒక ఆరాధ్య దైవంలా కొలుస్తూ ఉంటారు. ఇప్పటికీ చాలామంది ఒక కృష్ణుడు.. ఒక రాముడు ఎలా ? ఉంటారో మాకు తెలియదు.. మేం మా ఇళ్ళలో ఎన్టీఆర్ ఫోటో పెట్టుకుని పూజలు చేస్తూ ఉంటాం అని చెబుతుంటారు.
చాలామందికి ఇప్పటికీ ఒక కృష్ణుడు.. ఒక రాముడు అంటే ఎన్టీఆర్ ధరించిన ఆ పాత్రల రూపమే గుర్తుకు వస్తూ ఉంటుంది. ఎన్టీఆర్ తాను వేసిన పౌరాణిక పాత్రల ద్వారా ప్రజల మనసుల్లోకి అంతలా చొచ్చుకుపోయారు.. అయితే చాలామంది తెలుగు ప్రజల ఇళ్లల్లో సీనియర్ ఎన్టీఆర్ వేసిన కృష్ణుడు.. రాముడు పాత్రల ఫోటోలే పైన గోడకు తగిలించి ఉంటాయి. వాటికి పూజలు చేసే వాళ్ళు కూడా ఉంటారు.
ఇదిలా ఉంటే దివంగత సీనియర్ హీరో శోభన్ బాబు ఇంటిలోని పూజ గదిలో సీనియర్ ఎన్టీఆర్ ఫోటో ఉంటుంది అట. ప్రతిరోజు ఆయన పూజ గదిలో దేవుళ్లకు ఎలా ? పూజ చేస్తారో ఎన్టీఆర్‌ను కూడా అంతలా పూజించేవారట. అంటే ఎన్టీఆర్‌పై తనకు ఉన్న ఆ అభిమానాన్ని శోభన్‌బాబు అలా చాటుకునేవారు.
ఇక వీరిద్దరిది కూడా కృష్ణా జిల్లాయే కావడం. శోభన్‌బాబు సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ఎన్టీఆర్ బ్రదర్ అంటూ వెన్నుతట్టి మరీ ప్రోత్సహించారు. అలా వారిద్దరి అనుబంధం చివరి వరకు కొనసాగింది.