Movies"చచ్చినా మళ్ళీ వాడి ముఖం చూడను" ..మాజీ భర్త నిజస్వరూపం బయటపెట్టిన...

“చచ్చినా మళ్ళీ వాడి ముఖం చూడను” ..మాజీ భర్త నిజస్వరూపం బయటపెట్టిన 7/G హీరోయిన్ ..అంత టార్చర్ చేసాడా..!!

స్టార్ హీరోయిన్ సోనియా అగర్వాల్ డైరెక్టర్ నటుడు సెల్వరాఘవన్ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. కోలీవుడ్లో స్టార్ హీరోగా ఉన్న ధనుష్ అన్నయ్య నే ఈ సెల్వ రాఘవన్ అని అందరికీ తెలిసిందే . సెల్వ రాఘవన్ – సోనియా అగర్వాల్ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు . అయితే వీళ్ళ పెళ్లి మూడునాళ్ల ముచ్చటగా మిగిలిపోయింది . పెళ్లయిన చాలా తక్కువ టైంలోనే వీళ్లు విడాకులు తీసుకున్నారు .

ఈమె పెళ్లి తర్వాత కనీసం నాలుగు సంవత్సరాలు కూడా కలిసి ఉండలేకపోయింది దానికి ప్రధాన కారణం ఆమె మాజీ భర్త నే అంటూ ఆమె చెప్పుకొచ్చింది . తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ..” ఎందుకు తాము విడాకులు తీసుకున్నాము అనే విషయంపై క్లారిటీ ఇచ్చింది”. సోనియా మాట్లాడుతూ..”నేను సెల్వ పెళ్లి చేసుకున్నాక నా జీవితం అంతా ఆశాజనికంగా లేదు. పెళ్లయ్యాక సినిమాకు దూరంగా ఉండాలని నా మాజీ భర్త ఫ్యామిలీ కండిషన్స్ పెట్టింది. దానివల్లే మా మధ్య గొడవలు స్టార్ట్ అయ్యాయి. సెల్వ కూడా తన పేరెంట్స్ చెప్పిందే నమ్ముతాడు వింటాడు”.

“తనని నమ్మి వచ్చిన నాకు ఎటువంటి వాల్యూ ఇవ్వరు. వ్యక్తిగతంగా ఆయన చాలా మంచివాడు తన పని తాను చేసుకోపోతూ ఉంటాడు కానీ అమ్మానాన్నల విషయం వచ్చేసరికి వాళ్ళు చెప్పింది కరెక్ట్ అంటూ ఉంటాడు . ప్రస్తుతం మా జీవితాలు వేరువేరుగా ఉన్న బాగానే ఉన్నాయి. తను హ్యాపీగా ఉన్నాడు నేను కూడా హ్యాపీగానే ఉన్నాను ..చాలా మంది అంటూ ఉంటారు పెళ్ళి అయ్యి విడాకులు తీసుకున్న తర్వాత మేం ఫ్రెండ్స్ గా ఉంటామని ..అది నా విషయంలో జరగదు.. ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాక అతగాడితో వచ్చిన విభేదాలు కారణంగా విడాకులు తీసుకున్నాక ..మళ్ళీ అతగాడితో ఫ్రెండ్షిప్ చేయడం నావల్ల కాదు ..అంతే కాదు మళ్ళీ జీవితంలో ఆ వ్యక్తి ముఖాన్ని చూడనే చూడకూడదు అనుకుంటాను . అలాంటి వ్యక్తి నా జీవితంలో ఉన్న లేనట్టే అంటూ మాజీ భర్త సెల్వ రాఘవన్ పై సోనియా అగర్వాల్ షాకింగ్ కామెంట్స్ చేసింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news