తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంగేజ్మెంట్ తర్వాత పెళ్లి క్యాన్సిల్ చేసుకున్న స్టార్ హీరోలలో అఖిల్ అక్కినేని కూడా ఒకరు. అన్నీ అనుకున్నట్లు జరిగితే అఖిల్ ఈపాటికి ఓ ఇంటివాడు అయ్యేవాడు కానీ అలా జరగలేదు.. ప్రముఖ వ్యాపారవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రీయ భూపాల్ తో అఖిల్ ప్రేమలో పడ్డాడు.. 2017 డిసెంబర్ లో వీరి ఎంగేజ్మెంట్ ఎంతో ఘనంగా జరిగింది. 2018లో వీరి పెళ్లి ఇటలీలో ఎంతో ఘనంగా నిర్వహించాలని రెండు కుటుంబ సభ్యులు ప్లాన్ చేశారు పెళ్లి ఏర్పాట్లు కూడా మొదలుపెట్టారు.
కానీ తర్వాత ఏం జరిగిందో తెలియదు కానీ పెళ్లికి కొద్ది రోజులు ముందు అఖిల్, శ్రీయా భూపాల్ విడిపోయారు.. తమ నిశ్చితార్థాన్ని క్యాన్సిల్ చేసుకున్నారు. ఆ తర్వాత అఖిల్ టాలీవుడ్ లో హీరోగా బిజీ అవుతూ వరుస సినిమాలు చేసుకుంటూ వస్తున్నాడు. పెళ్లి క్యాన్సిల్ అయిన తర్వాత శ్రీయా భూపాల్ ఎలా ఉంది..? ఏం చేస్తుంది..? అన్న విషయాలు చాలామందికి తెలియదు. శ్రీయా భూపాల్ న్యూయార్క్ లో ఫ్యాషన్ స్కూల్లో చదువుకుంది. ఆ తర్వాత చిత్ర పరిశ్రమలో కాస్ట్యూమ్ డిజైనర్ గా అడుగుపెట్టి టాలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు ఎంతో మంది సినీ తారలకు కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేసింది.
అఖిల్‌తో విడిపోయిన తర్వాత కొన్ని రోజులు ఒంటరిగా ఉన్నన శ్రీయా భూపాల్.. 2018లో అపోలో హాస్పిటల్స్ గ్రూప్ చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి మనవడు చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్ రెడ్డి పెద్ద కుమారుడు ఉపాసన కామినేని తమ్ముడు అనిందిత్ రెడ్డిని పెళ్లి చేసుకుంది. అప్పట్లో వీరి పెళ్లి ఎంతో ఘనంగా జరిగింది. ఇక పెళ్లి తర్వాత శ్రీయా భోపాల్ భర్తతో కలిసి ఫారెన్‌లో సెటిలైంది. ఈ ఏడాది ఈ దంపతులకు పండంటి మగ బిడ్డ కూడా జన్మించాడు. ఫారెన్‌లో వాళ్లకు ఉన్న కోట్ల ఆస్తులతో ఆమె చాలా విలాసవంతమైన లైఫ్ ఎంజాయ్ చేస్తోందట.
ఇక ప్రస్తుతం శ్రీయ ఒకవైపు ఫ్యామిలీ లైఫ్ ను ఎంజాయ్ చేస్తూనే మరోవైపు తన వృత్తిని కూడా కొనసాగిస్తుంది. అయితే అఖిల్- శ్రీయ విడిపోవడానికి అప్పట్లో రెండు కారణాలు ప్రధానంగా వినిపించాయి. అందులో మొదటిది అఖిల్‌కు పలువురు అమ్మాయిలతో ఎఫైర్స్ ఉన్నాయని తెలియటం వల్లే శ్రీయ పెళ్లిని క్యాన్సిల్ చేసుకునిదని వార్తలు వచ్చాయి. అలాగే అఖిల్ ఆస్తుల విషయంలో జరిగిన గొడవ కూడా పెళ్లి క్యాన్సిల్ అవడానికి కారణమని వినిపించింది. మరి ఇందులో ఏది నిజమో వారికే తెలియాలి.