చెన్నై బ్యూటీ రెజీనా తొలుత కోలీవుడ్లో నట ప్రయాణం ప్రారంభించి.. ఆ తర్వాత టాలీవుడ్ తో పాటు ఇతర దక్షిణాది భాషల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 2005లో కండనాల్ అనే తమిళ సినిమాలో హీరోయిన్గా నటించిన ఆమె కెరీర్ ప్రారంభంలో తమిళంలో కొన్ని సినిమాలలో నటించింది. అయితే అక్కడ ఆమెకు ఫేమింగ్ రాలేదు. దీంతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి యంగ్ హీరోలతో జతకట్టి మంచి పేరు తెచ్చుకుంది. రెజీనా తన కెరీర్లో తెలుగులోనే ఎక్కువగా సినిమాలు చేసింది.
ఇటీవల ఆమెకు అవకాశాలు తగ్గడంతో అమ్మడు వెబ్ సిరీస్ లపై కాన్సన్ట్రేషన్ చేస్తోంది. తాజాగా ఒక ఇంటర్వ్యూలో రెజీనా తనకు ఎదురైన కాస్టింగ్ అనుభవం గురించి మాట్లాడింది. రెజీనా కేవలం 17 ఏళ్ల వయసులోనే వెండితెరకు పరిచయం అయింది. ఆ సమయంలో చాలామంది నుంచి తాను చేదు అనుభవాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని వాపోయింది.
తన సినిమా కెరియర్ ప్రారంభంలో అవకాశాల కోసం కొందరిని సంప్రదించానని.. ఒక వ్యక్తి ఫోన్ చేసి నీకు సినిమా ఛాన్స్ ఇస్తా అడ్జస్ట్మెంట్ కి ఓకే అంటే తర్వాత వెంటనే షూటింగ్ పని చేసుకోవచ్చు అన్నాడు.. ఇది జరిగి సుమారు పది సంవత్సరాలు అయింది.. అప్పటికి నా వయసు కేవలం 20 సంవత్సరాలు మాత్రమే అని రెజీనా తెలిపింది. ఆ టైంలో అతడి మాటలు పట్ల నాకు సరైన అవగాహన లేదని.. అసలు అడ్జస్ట్మెంట్ అంటే ఏమిటో తెలియదు.. రెమ్యూనరేషన్ విషయంలో సర్దుబాటు చేసుకుంటావా ? అని అడుగుతున్నాడేమో అనుకున్నానని చెప్పింది.
సరే నా మేనేజర్ నీతో మాట్లాడతారని ఫోన్ కట్ చేశాను అని రెజీనా తెలిపింది. తర్వాత మేనేజర్ ద్వారా అసలు విషయం తెలిసిందని.. ఆ ఫోన్ చేసిన వ్యక్తి రకరకాల కోరికలు కోరాడని అర్థమైంది.. ఆ సంఘటన తర్వాత మళ్లీ నాకు అలాంటి అనుభవం ఎదురు కాలేదని రెజీనా చెప్పింది. అయితే ఇండస్ట్రీలో కొందరు నటీమణులు మాత్రం ఇలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వస్తుందని.. అయితే కొందరు మాత్రం ఫేమస్ అవ్వాలని అబద్ధాలు కూడా చెబుతుంటారని.. నిజం ఏమిటో వారికి మాత్రమే తెలుసు అంటూ రెజీనా తెలిపింది.