ప్రముఖ భారత టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా – పాకిస్తాన్ స్టార్ క్రికెటర్ షోయబ్ మాలిక్ వివాహం అప్పట్లో ఒక సంచలనం. దాయాది దేశాలు ఆయన భారత్, పాకిస్తాన్ కు చెందిన ఈ క్రీడాకారులు ఇద్దరు ప్రేమ వివాహం చేసుకున్నారు. మరో విశేషం ఏంటంటే వీరిద్దరూ తమ తమ క్రీడల్లో స్టార్ ప్లేయర్లు కావటం విశేషం. షోయబ్ మాలిక్ స్టార్ క్రికెటర్ అయితే.. సానియా మీర్జా భారత స్టార్ టెన్నిస్ క్రీడాకారిణి కావడం విశేషం.
ఈ క్రమంలోనే 2010లో వీరిద్దరి పెళ్లి జరగగా అప్పట్లో ఒక సెన్సేషన్ అయింది. ఈ దంపతులకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. గత కొన్నేళ్ళుగా షోయబ్ పాకిస్తాన్లో ఉంటుంటే.. సానియా హైదరాబాదులోనే ఉంటుంది. రకరకాల కారణాలతో వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోతున్నారంటూ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఎవరు క్లారిటీ ఇవ్వలేదు. ఓ టాక్ షోలో సానియా, షోయబ్ కలిసి పాల్గొనడంతో కొంతకాలం పాటు పుకార్లకు చెక్ కూడా పడింది.
అయితే తాజాగా మరోసారి వీరిద్దరు విడాకులు వ్యవహారం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. షోయబ్ మాలిక్ తన ఇంస్టాగ్రామ్ బయోలో మార్పులు చేర్పులు చేశాడు. గతంలో షోయబ్ సూపర్ వుమెన్ సానియా మీర్జా భర్త అని పెట్టుకున్నాడు. ఇప్పుడు ఆ పదాన్ని తొలగించాడు. అది చూసిన నెటిజన్లు వీరిద్దరూ విడాకులు తీసుకుని విడిపోయారని అందుకే షోయబ్ తన ఇన్స్టా పోస్టుతో క్లారిటీ ఇచ్చాడని గుసగుసలాడుకుంటున్నారు.
ఇప్పుడు దీనిపై సోషల్ మీడియాలో విస్తృతంగా చర్చ జరుగుతుంది. అయితే అటు షోయబ్, సానియా ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నట్టు అధికారికంగా ఎప్పుడు ప్రకటించలేదు. అయితే చాలా కాలంగా ఎవరి దారుల్లో వారు.. ఎవరి దేశాల్లో వారు నివసిస్తున్నారు. ఇలా అయితే వీరిద్దరూ ఇక కలిసి కాపురం ఎలా చేస్తున్నారు అన్న సందేహాలు అయితే లెక్కేలేదు.