ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . సమంత ని తన మేనేజర్ మోసం చేశాడా..? అంటే అవును అని అంటున్నారు సినీ ప్రముఖులు. అంతేకాదు సమంతకి తెలియకుండా పలువురు డైరెక్టర్స్ తో ఆమె రెమ్యూనరేషన్ ఎక్కువ డిమాండ్ చేస్తుంది అని చెప్పి మరి ఆమె అడిగిన దానికి డబుల్ రెమ్యూనరేషన్ నొక్కేస్తున్నాడట . తాజాగా ఖుషి సినిమా ద్వారా ఆ న్యూస్ బయటపడింది. ఖుషి సినిమాకు గాను ఆమె ఏకంగా నాలుగు కోట్లు డిమాండ్ చేసిందట .
కానీ ఖుషి సినిమా స్టార్ట్ అవ్వగానే ఆమెకు అనారోగ్యం రావడంతో మేకర్స్ కూడా ఆమెకు హెల్ప్ చేయడంతో దయా హృదయం గల సమంత ఆ రెమ్యూనరేషన్ ని మూడు కోట్లు తగ్గించుకొని కోటి రూపాయలు చేసిందట . అయితే మేనేజర్ మాత్రం సమంత రెండు కోట్లు డిమాండ్ చేస్తుంది అంటూ డైరెక్టర్ ప్రొడ్యూసర్ కి చెప్పుకొచ్చారట . సమంత క్రేజ్ దృష్ట్యా వాళ్ళు అలాగే అంటూ ఓకే చేశారట . ఇప్పుడు సినిమా షూట్ అయి రిలీజ్ అయ్యే టైంలో మిగతా కోటి ఎప్పుడు ఇవ్వాలి మేడం అంటూ సమంత కు కాల్ చేసి మరి అడిగారట ప్రొడ్యూసర్స్.
దీంతో అర్థం కాని సమంత మరో కోటి ఏంటండీ అంటూ తెలియకుండానే అడిగిందట . దీంతో మేనేజర్ రెండు కోట్లు అడిగిన విషయం బయటపడింది. అంతేకాదు ఈ సినిమా కన్నా ముందు పలువురు డైరెక్టర్స్ తో సమంత పేరు వాడుకొని కొన్ని కోట్లు నొక్కేసాడు అన్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది . ప్రెసెంట్ ఇదే న్యూస్ వైరల్ అవుతుంది. సమంత అతగాడిని తీసేసి వేరే మేనేజర్ ని పెట్టుకోవడానికి చూస్తుందట. కానీ చాలా నమ్మకంగా ఉన్న వ్యక్తి కావడంతో నమ్మించి మోసం చేస్తావా అన్న బాధ ఎక్కువగా ఉంది అంటూ ప్రచారం జరుగుతుంది . దీనితో సోషల్ మీడియాలో సమంత మేనేజర్ పై ఫైర్ అవుతున్నారు ఆమె ఫ్యాన్స్..!!