Movies' స‌లార్ ' ఏపీ, తెలంగాణ ఏరియా వైజ్ బిజినెస్‌… ఏంది...

‘ స‌లార్ ‘ ఏపీ, తెలంగాణ ఏరియా వైజ్ బిజినెస్‌… ఏంది ఈ స్టామినా ప్ర‌భాస్ రాజు…!

బాహుబలి తర్వాత సాలిడ్ హిట్ పడకపోయినా ప్రభాస్ ప్రతి సినిమాకు బిజినెస్ పరంగా మాత్రం రికార్డులు క్రియేట్ చేస్తున్నాయి. ఈ ఏడాది ఇప్పటికే ఆదిపురుష్‌ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ప్రభాస్ ఆ సినిమాతో కూడా అభిమానులను డిసప్పాయింట్ చేశాడు. వాస్తవంగా చెప్పాలి అంటే ఆదిపురుష్‌ సినిమాపై ప్రభాస్ అభిమానులకే అంత నమ్మకాలు లేవు.

అయితే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న స‌లార్ – కల్కి సినిమాలపై ఏ స్థాయిలో అంచనాలు ఉన్నాయో చెప్పక్కర్లేదు. ఇక సలార్ సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ముందుకు వస్తోంది. కేజీఎఫ్ సిరీస్ సినిమాల తర్వాత ప్రశాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాకు జరుగుతున్న ఫ్రీ రిలీజ్ బిజినెస్ ప్రభాస్ రేంజ్ ఏంటి ? అన్నది మరోసారి చాటి చెబుతోంది.

సలార్ సినిమాకు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలోనే రు. 170 కోట్ల బిజినెస్ జరిగింది. ఆదిపురుష్‌ సినిమాకు రు. 130 కోట్ల రేంజ్ లో ఏపీ, తెలంగాణ బిజినెస్ జరగగా.. దానికి అదనంగా మరో రు. 40 కోట్లు సలార్ బిజినెస్ చేసింది. నైజం హక్కులు 60 కోట్లు – సీడెడ్ 28 కోట్లు – ఆంధ్ర 75 కోట్లకు అమ్మేరని తెలుస్తోంది. ఓవరాల్‌గా ఏపీ, తెలంగాణలో రు. 170 కోట్లతో ప్రభాస్ తన సత్తా చాటాడు.

ప్రభాస్ సరసన శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతి బాబు, పృథ్విరాజ్ సుకుమారన్, శ్రియారెడ్డి నటిస్తున్నారు. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ లో ట్రైలర్ తో సినిమా ప్రమోషన్స్ స్టార్ట్ చేయాలని మేక‌ర్స్ ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news