News' దేవ‌ర ' నుంచి సైఫ్ ఆలీఖాన్ ఫ‌స్ట్ లుక్‌... భ‌యంక‌ర...

‘ దేవ‌ర ‘ నుంచి సైఫ్ ఆలీఖాన్ ఫ‌స్ట్ లుక్‌… భ‌యంక‌ర ‘ భైరా ‘ గా ఎంట్రీ…!

గ్లోబల్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్ ఇండియా సినిమా దేవార‌. మిక్కిలినేని సుధాకర్ – నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. ఎన్టీఆర్‌కు జోడిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ హీరోయిన్గా ఎంపికైన సంగతి తెలిసిందే..

తాజాగా ఈ సినిమా మేకర్స్ ఇందులో విలన్ గా నటిస్తున్న ప్రముఖ బాలీవుడ్ స్టార్ నటుడు సైఫ్ ఆలీఖాన్‌ గురించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాలో సైఫ్‌ అవైటెడ్ ఫస్ట్ లుక్ ఎన్టీఆర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. నిజంగా ఈ లుక్ లో సైఫ్ అలీ ఖాన్ ఊహించిన మేకోవర్లో ఉన్నాడని చెప్పాలి. ఎన్టీఆర్ కి ఫస్ట్ లుక్ లో ఉన్నట్టుగానే లాంగ్ హెయిర్ తో సైఫ్ లుక్‌ కూడా ఉంది.

ఈ సినిమాలో తాము సైఫ్‌ను భైరాగా ప్రజెంట్ చేస్తున్నట్టు తెలిపారు. సైఫ్ అలీఖాన్ లాంగ్ హెయిర్ తో అతి క్రూరంగా సముద్రం వైపు చూస్తున్నట్టుగా ఉంది. ఈ ఫస్ట్ లుక్ తోనే సైఫ్ ఆలీఖాన్ భైరా రోల్ ఎంత ?పవర్ఫుల్ గా ఉండబోతుందో తెలుస్తోంది. అనిరుధ్‌ సంగీతం అందిస్తున్న ఈ సినిమా వచ్చే యేడాది ఏప్రిల్ 5న థియేటర్లలోకి రానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news