పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్‌లో ఉంటారు. కొద్ది రోజుల క్రితం రేణు దేశాయ్ పవన్‌తో విడాకుల గురించి.. పవన్ గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆమె టార్గెట్ చేస్తూ కొందరు సోషల్ మీడియాలో దారుణమైన పోస్టులు.. కామెంట్లు పెట్టారు. దీంతో రేణు దేశాయ్ తన ఇన్‌స్టా వేదికగా తన విడాకులపై సంచలన కామెంట్ చేశారు.
తన విడాకుల విషయంలో మాజీ భర్త ఎలా ? మోసం చేశాడనే వాస్తవాన్ని గతంలో చెప్పినప్పుడు ఆయన అభిమానులు చాలా దారుణమైన పదాలతో తిట్టారు. ఇప్పుడు దేశ పౌరురాలుగా నేను అతడికి అనుకూలంగా మాట్లాడినప్పుడు అతడిని ద్వేషించేవారు.. నన్ను తిడుతున్నారు. విడాకుల విషయంలో నా మాజీ భర్త గురించి అప్పట్లో నేను మాట్లాడింది నిజం.. ఆరోజు అలా మాట్లాడినందుకు కొందరి నుంచి నేను డబ్బులు తీసుకున్నానని పవన్ అభిమానులు ఆరోపించారు.. అంతేకాకుండా సోషల్ మీడియా ద్వారా నన్ను చాలా తిట్లు తిట్టారు.. ఇప్పుడు కూడా మళ్లీ అలాంటిదే నా విషయంలో జరుగుతుంది.. నా మాజీ భర్తకు అనుకూలంగా ఉండే వ్యక్తులు నాకు డబ్బు ఇచ్చారని కొందరు ఆరోపిస్తున్నారు… ఇందులో ఎలాంటి నిజం లేదని రేణు కుండ బద్దలు కొట్టింది.
నా మాజీ భర్త గురించి నేను అప్పుడు ఇప్పుడు రెండు సార్లు కూడా నిజం చెప్పానని.. అతడితో ప్రేమలో పడి నిజం మాట్లాడినందుకు నేను చెల్లించాల్సిన మూల్యం ఇదే అని రేణు దేశాయ్ వాపోయింది. ఇది నా విధి అయితే అలాగే ఉండనీయండి.. దయచేసి నాపై దుర్భాషలాడకండి అని రేణు దేశాయ్ కోరుకుంది. దీంతో ఆమె చేసిన కామెంట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.