కోలీవుడ్ స్టార్ హీరో సూర్యకు రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ భారీస్థాయిలో అభిమానులు ఉన్నారు. అసలు ఒకప్పుడు తమిళం కంటే కూడా తెలుగులో సూర్య మార్కెట్ ఎక్కువుగా ఉండేది. ముఖ్యంగా సింగం 2, సింగం 3 సినిమాలకు తమిళం కంటే తెలుగులోనే ఎక్కువ మార్కెట్ జరిగింది. ఇక ఇప్పుడు తెలుగులో మన స్టార్ హీరోల సినిమాల రీ రిలీజ్ ట్రెండ్ బాగా నడుస్తోంది.
గతంలో హిట్ అయిన సినిమాలనే కాదు.. ప్లాప్ అయిన సినిమాలను కూడా తిరిగి ఇప్పుడు రీ రిలీజ్ చేస్తున్నారు. మొత్తానికి ఫ్యాన్స్ ఉత్సాహమో లేదా ఆ క్లాసిక్ కల్ట్ సినిమాలను ఇప్పుడు 4కే వెర్షన్‌లో చూడాలన్న కోరికో కాని.. రీ రిలీజ్ సినిమాలకు వసూళ్లు దుమ్ము రేపుతున్నాయి. ఖుషి లాంటి సినిమాలకు ఏకంగా రు. 7-8 కోట్లు కూడా వచ్చాయి. ఆరెంజ్ లాంటి ప్లాప్ సినిమాకు కూడా రు. 5 కోట్లు వచ్చాయి.
ఇక సూర్య అప్పుడెప్పుడో 15 ఏళ్ల క్రితం నటించిన సినిమా సూర్య సన్నాఫ్ కృష్ణన్. ఈ సినిమా ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో రీ రిలీజ్ కాగా.. ఈ సినిమాకు మన తెలుగు ఆడియెన్స్ సెన్సేషనల్ రెస్పాన్స్ అందించారు. అయితే ఫస్ట్ డే వసూళ్లలో ఈ సినిమా సెన్షేషనల్ రికార్డు సెట్ చేసుకుంది. మొదటి రోజుకే ఒక కోటి గ్రాస్ అందుకున్న సినిమాల లిస్టులో సూర్య సన్నాఫ్ కృష్ణన్ చేరడం నిజంగా గ్రేటే.
ఓ కోలీవుడ్ హీరో ప్లాప్ సినిమా.. అది కూడా రిలీజ్ అయ్యాక 15 ఏళ్లకు ఇప్పుడు ఇక్కడ రీ రిలీజ్ చేస్తే ఫస్ట్ డే కోటి గ్రాస్ అంటే మామూలు విషయం కాదు. నిన్న ఒక్కరోజు లోనే 24 వేలకి పైగా టికెట్స్ అమ్ముడుపోయాయి. ఇది అప్పట్లోనే కల్ట్ క్లాసిక్ సినిమాగా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమాకు హరీష్ జైరాజ్ ఆల్బమ్ అప్పట్లో సెన్షేషన్ అని చెప్పక్కర్లేదు.