Moviesఅఫిషియల్: నక్క తోక తొక్కిన రష్మిక..ఏకంగా ఆయనతోనే.. జాక్ పాట్ ఆఫర్...

అఫిషియల్: నక్క తోక తొక్కిన రష్మిక..ఏకంగా ఆయనతోనే.. జాక్ పాట్ ఆఫర్ కొట్టేసిందిగా..!!

నేషనల్ క్రష్ గా గా పేరు సంపాదించుకున్న రష్మిక మందనా.. ప్రెసెంట్ ఇండస్ట్రీలో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మరీ ముఖ్యంగా ఆమె నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద డిజాస్టర్ అవుతున్న సరే వరుసగా క్రేజీ క్రేజీ ఆఫర్స్ ను పట్టేస్తుంది . ఇప్పటికి చేతిలో బోలెడు బడా ప్రాజెక్ట్స్ పట్టుకుని ఉన్న రష్మిక మందన్నా.. రీసెంట్గా బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ తో స్క్రీన్ షేర్ చేసుకునేందుకు సిద్ధమయింది .

గతంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బాద్షా షారుక్ తన ఫేవరెట్ అని.. ఒక్కసారైనా ఆయన తో నటించాలని ఉందని మనసులో మాట బయటపెట్టింది .. అంతే టక్కున డైరెక్టర్ పిలిచి మరి ఆఫర్ ఇచ్చారు. అతని పక్కన ఒకే ఫ్రేమ్లో కనిపించడానికి బిగ్ చాన్స్ ఇచ్చాడు . ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో బాద్షాగా పేరు సంపాదించుకున్న షారుక్ ఖాన్ తో రష్మిక మందన్నా స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది అన్న న్యూస్ ఇప్పుడు వైరల్ గా మారింది .

షారుక్ తో కలిసి రష్మిక ఓ యాడ్లో నటించింది . ఇందుకు సంబంధించిన ఫోటోలు రిలీజ్ చేసారు మేకర్స్. ఈ ఫోటోలో షారుక్ చాలా హ్యాండ్ సమ్ గా..రష్మిక హాట్ గా కనిపించింది. మొత్తానికి రష్మిక కోరికను ఈ విధంగా తీర్చేశాడు షారుక్. అమ్మడు నక్క తోక తొక్కింది అంటూ జనాలు కామెంట్స్ చేస్తున్నారు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news