సినిమా ఇండస్ట్రీలో ఓ హీరో కోసం రాసుకున్న కథను మరో హీరో చేస్తూ ఉండడం సర్వసాధారణం . అలాగే ఒక కథను రాసుకున్నప్పుడు హీరో పక్కన ఈ హీరోయిన్ అయితే బాగుంటది అని డైరెక్టర్ ముందుగానే ఊహించుకుంటారు. కానీ ఫైనల్లీ ఆ కథను తీసుకెళ్లి ఆ హీరోయిన్ కి చెప్పినప్పుడు ఆ కథ నచ్చకనో.. లేక ఆ కథలో వాళ్లకు ఇంపార్టెన్స్ లేకనో.. రిజెక్ట్ చేస్తూ ఉంటారు.
కాగా అలాగా రిజెక్ట్ చేసి పొరపాటు చేసిన హీరోయిన్స్ ఎంతో మంది ఉన్నారు. ఆ లిస్ట్ లోకే వస్తారు ఈ బ్యూటీస్. ఆ ఇద్దరు స్టార్ హీరోయిన్లు వారు ఎవరో కాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటి సంపాదించుకున్న పూజా హెగ్డే – రాశి ఖన్నా. ఎస్ ఈ ఇద్దరు తమ తలరాతను వీళ్ళే మార్చేసుకున్నారు. చేతులారా ఇంటి వద్దకు వచ్చిన బిగ్ ఆఫర్ ని రిజెక్ట్ చేసుకున్నారు .
ఆ ఆఫర్ మరి ఏదో కాదు హనురాగవపూడి తెరకెక్కించిన సీతారామం. ఎస్ సీతారామం సినిమా ఎంత హిట్ అయిందో మనకు బాగా తెలిసిన విషయమే . ఇప్పటికీ కూల్ అండ్ క్లాసిక్ లవ్ స్టోరీ గా చరిత్రలో మిగిలిపోయింది . ఇలాంటి సినిమాలో హీరోయిన్గా ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేసుకునింది పూజ హెగ్డే. మృణాల్ పాత్ర కోసం మొదటగా పూజ హెగ్డేను అప్రోచ్ అయ్యారట డైరెక్టర్ . అప్పటికే రాధే శ్యామ్ సినిమా చేస్తూ ఉండటంతో ఈ ఆఫర్ రిజెక్ట్ చేసింది. రష్మిక పాత్ర కూడా మొదట రాశి ఖన్నాకు వెళ్లింది.. ఆమె గెస్ట్ రోల్ అని రిజెక్ట్ చేయడంతోనే ఈ పాత్ర రష్మిక ఫైనల్ అయ్యింది. ఈ సినిమా వాళ్ల ఇద్దరి జీవితాలను ఎలా మార్చేసిందో ప్రత్యేకంగా చెప్పాలా..?