Moviesపుష్ప జాతీయ అవార్డ్ స్పెషల్: "తగ్గేదేలే" డైలాగ్ ఎలా పుట్టిందో తెలుసా.....

పుష్ప జాతీయ అవార్డ్ స్పెషల్: “తగ్గేదేలే” డైలాగ్ ఎలా పుట్టిందో తెలుసా.. ఆ బూతు పదం నుండే..!

పుష్ప .. పుష్ప రాజ్నీ.. యవ్వ తగ్గేదేలా ఈ డైలాగు వింటే మనకు తెలియకుండా గూస్ బంప్స్ వచ్చేస్తాయి. మన డైలీ లైఫ్ లో ఈ డైలాగులు ఎన్నిసార్లు వాడుతుంటామో లెక్కేలేదు . అలాంటి ఒక క్రేజీ డైలాగ్ లు రాసుకొచ్చాడు సుకుమార్. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే స్పెషల్ ఇమేజ్ కలిగిన డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న సుకుమార్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని తెరకెక్కించిన సినిమా పుష్ప ది రైజ్ పార్ట్ వన్ .

డిసెంబర్ 17న 2021 న రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ టాక్ నమోదు చేసుకోవడమే కాకుండా కలెక్షన్స్ పరంగా కూడా బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది . అంతేకాదు సినిమా ఇండస్ట్రీలోనే అల్లు అర్జున్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ తీసుకొచ్చిన మూవీ ఇదే కావడం గమనార్హం . కాగా ఈ సినిమాలో నటించినందుకు హాను ఏకంగా అల్లు అర్జున్ రీసెంట్ గా బెస్ట్ నటుడు గా జాతీయ అవార్డు లభించింది.

ఇదే క్రమంలో సోషల్ మీడియాలో ఆయనకు భారీ ఎత్తున శుభాకాంక్షలు వెలువ మొదలైంది . అయితే పుష్ప సినిమాలో హైలెట్ గా మారిన పుష్ప పుష్పరాజ్ నీ యవ్వ తగ్గేదేలే అనే డైలాగ్ ఎలా పుట్టింది అనే విషయం ఇంటర్నెట్లో హాట్ టాపిక్ ట్రెండ్ అవుతుంది . అయితే ఈ సినిమా కధ రాసుకోవడానికి సుకుమార్ చిత్తూరు వెళ్ళినప్పుడు అక్కడ గొడవ జరుగుతుంది అని.. ఆ గొడవలో వాళ్ళు మాట్లాడుకున్న బూతు పదాలను ట్రెండీగా మార్చి సుకుమార్ ఇలాంటి ఓ స్పెషల్ డైలాగ్ ను క్రియేట్ చేశారని తెలుస్తుంది . ఇదే న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news