Moviesప‌వ‌న్ క‌ళ్యాణ్ VS మ‌హేష్‌బాబు… మ‌ళ్లీ ఈ గొడ‌వ రిపీట్ …!

ప‌వ‌న్ క‌ళ్యాణ్ VS మ‌హేష్‌బాబు… మ‌ళ్లీ ఈ గొడ‌వ రిపీట్ …!

టాలీవుడ్‌లో సూపర్ స్టార్ మహేష్ బాబు, ప‌వ‌ర్‌స్టార్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయంటే బాక్సాఫీస్ ఎంత‌లా షేక్ అవుతుందో చెప్ప‌క్క‌ర్లేదు. అలాంటిది వీరిద్ద‌రి సినిమాలు ఒకే టైంలో వ‌స్తుంటే ఇక తెలుగు తెర హోరెత్తిపోతుంది. థియేట‌ర్ల‌లో ఈ ఇద్ద‌రు స్టార్ హీరోల‌ అభిమానులు చేసే హంగామాకు అంతే ఉండ‌దు. ఇప్పుడు వ‌చ్చే సంక్రాంతికి ఇదే సీన్ థియేట‌ర్ల‌లో రిపీట్ కాబోతోందో అంటే అవున‌నే సంకేతాలు వ‌స్తున్నాయి

మ‌హేష్‌బాబు హీరోగా మాట‌ల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కిస్తున్న గుంటూరు కారం సినిమా ఇప్ప‌టికే చాలా వ‌ర‌కు షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం ఫ్యామిలీ లండన్ వెకేషన్ లో ఉన్న మహేష్ ఈనెల రెండవ వారంలో ఇండియాకు వ‌చ్చిన వెంట‌నే తిరిగి నెక్ట్స్ షెడ్యూల్ షూటింగ్‌లో జాయిన్ అవుతాడు. ఈ సినిమాను వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా 2024 జనవరి 12న విడుదల చేస్తున్నట్టు ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు.

ఇక థమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా హారికా హాసిని క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తోంది. అదే టైంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కిస్తున్న సినిమా ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్‌. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మిస్తుండగా దేవిశ్రీప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో కూడా శ్రీలీల హీరోయిన్‌.

ఈ సినిమాను కూడా వ‌చ్చే సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేయ‌నున్నారు. ఈ సినిమాను కూడా 2024 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. మ‌రి ప్ర‌భాస్ క‌ల్కి సినిమా కూడా సంక్రాంతికే షెడ్యూల్ అయ్యి ఉంది. ఏదేమైనా మ‌హేష్ వ‌ర్సెస్ ప‌వ‌న్ సినిమాలు సంక్రాంతికి పోటీ ప‌డితే ఖ‌చ్చితంగా స‌రిలేరు నీకెవ్వ‌రు, అల వైకంఠ‌పుర‌ములో సినిమాల టైంలో జ‌రిగిన బాక్సాఫీస్ క్లాష్‌ను మ‌నం మ‌రోసారి చూడ‌బోతున్నాం..!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news