నరికిన కొద్దీ నీకు ఆయసం వస్తుందేమో.. నాకు ఊపు వస్తుంది అంటూ బాలయ్య చెప్పిన డైలాగ్ నిజంగా బాలయ్యకే పర్ఫెక్ట్ గా సెట్ అయింది. ఏజ్ పెరుగుతున్న కొద్దీ మరింత ఊపుతో నటసింహం బాలయ్య సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు పోటీగా దూసుకుపోతున్నాడు. పైగా తన వయసుకు తగిన పాత్రలు ఎంచుకుంటూ బ్యాక్ టు బ్యాక్లతో చెలరేగిపోతున్నాడు. ఒకప్పుడు బాలయ్య సినిమాలు ర. 50 కోట్ల మార్కు టచ్ చేయడానికి ఆపసోపాలు పడేవి.
అలాంటిది ఇప్పుడు బాలయ్య సినిమా తొలిరోజే రు. 50 కోట్ల రేంజ్ లో వసూళ్లు సాధిస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య భగవంత్ కేసరి అనే యాక్షన్ ఫ్యామిలీ డ్రామా సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్లు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. పైగా అఖండ – వీర సింహారెడ్డి లాంటి రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్ సినిమాల తర్వాత.. అది కూడా అసలు పరాజయం అన్నదే లేని అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో భగవంత్ కేసరి సినిమాకు ఒక రేంజ్ లో ప్రి రిలీజ్ బిజినెస్ జరుగుతోందని ట్రేడ్ వర్గాల లెక్కలు చెబుతున్నాయి.
ఒక్క ఆంధ్ర ఏరియాలోని ఈ సినిమాకు రు. 35 కోట్ల బిజినెస్ జరిగిందట. అది కూడా సీడిడ్ మినహాయించి కావడం విశేషం. ఇది బాలయ్య కెరీర్ లోనే ఆల్ టైం రికార్డ్ గా నిలిచింది. ఇక నైజాంతో పాటు ఉత్తరాంధ్ర లోను దిల్ రాజు పెద్ద మొత్తంలో చెల్లించి ఈ సినిమా రైట్స్ తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. రెండు తెలుగు రాష్ట్రాలలో రు. 60 కోట్ల రేంజ్ లో బిజినెస్ జరుగుతుందట.
ఇక రెస్ట్ ఆఫ్ ఇండియా.. ఓవర్సీస్ కలుపుకుంటే మరో రు. 20 కోట్లు ఈజీగా వస్తాయి. మొత్తంగా బాలయ్య కెరీర్ లోనే రు. 80 కోట్ల రేంజ్ లో ఈ సినిమా బిజినెస్ చేసింది. బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా సేఫ్ అవ్వాలంటే కాస్త అటు ఇటుగా రు. 140 నుంచి 150 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించాల్సి ఉంటుంది. అయితే ఈ సినిమాకి పోటీగా రవితేజ టైగర్ నాగేశ్వరరావు – కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లియో సినిమాలు కూడా రిలీజ్ అవుతున్నాయి.
అయినా కూడా బాలయ్య సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ జరుగుతుందంటే మామూలు విషయం కాదు. బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తుండగా.. మరో కుర్ర హీరోయిన్ శ్రీలీల కీలక పాత్రలో నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను షైన్ స్క్రీన్ పతాకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు.