Moviesఎన్టీఆర్ కొడుకు సినిమాలోకి వచ్చేస్తున్నాడోచ్.. ఆ స్టార్ హీరో ఎవరో తెలిస్తే...

ఎన్టీఆర్ కొడుకు సినిమాలోకి వచ్చేస్తున్నాడోచ్.. ఆ స్టార్ హీరో ఎవరో తెలిస్తే గూస్ బంప్స్ పక్కా..!?

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది . టాలీవుడ్ యంగ్ టైగర్ గా పాపులారిటీ సంపాదించుకున్న జూనియర్ ఎన్టీఆర్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని నటిస్తున్న దేవర. ఈ సినిమాలో ఆయన కొడుకు నటించబోతున్నాడా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు . మనకు తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ కి ఇద్దరు కొడుకులు. భార్గవ్ రామ్ – అభయ్ రామ్. ఇద్దరు కూడా చాలా బబ్లిగా క్యూట్ గా ఉంటారు.

కాగా ఇదే క్రమంలో ఇద్దరు తెరపై ఎంట్రీ ఇస్తే చూడాలి అన్నది అభిమానుల కోరిక . ఫైనల్లి ఆ కోరికను నిజం చేస్తున్నాడు ఎన్టీఆర్ . కొరటాల శివ దర్శకత్వం తెరకెక్కుతున్న దేవర సినిమాలో ఎన్టీఆర్ చిన్నప్పటి రోల్ లో ఎన్టీఆర్ చిన్న కొడుకు నటిస్తున్నాడట. మొదట ఈ ప్రాజెక్టులో వేరే స్టార్ హీరో కొడుకుని భాగం చేయాలనుకున్నారట మేకర్స్.

కానీ కొరటాల శివ ఎన్టీఆర్ కి ఇష్టం లేకపోయినా బలవంతంగా పట్టుబట్టి ఒప్పించ్చి మరి ఈ పాత్రకు ఎన్టీఆర్ చిన్న కొడుకును చూస్ చేసుకున్నట్లు తెలుస్తుంది . దీంతో సోషల్ మీడియాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఈ న్యూస్ ని ట్రెండ్ చేస్తున్నారు . తెరపై నాన్న-కొడుకు స్క్రీన్ ప్రెజన్స్ ఎలా ఉండబోతుందో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తెరపై తన కొడుకుతో స్క్రీన్ షేర్ చేసుకుంటే తారక్ ఎలా ఫీల్ అవుతాడు అనే విషయాన్ని ఇప్పుడు ట్రెండ్ చేస్తున్నారు అభిమానులు..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news