Moviesనాగార్జున - రంభ మ‌ధ్య ఎందుకు చెడింది… వీరి కాంబినేష‌న్లో అందుకే...

నాగార్జున – రంభ మ‌ధ్య ఎందుకు చెడింది… వీరి కాంబినేష‌న్లో అందుకే సినిమాలు లేవా..!

టాలీవుడ్ ఒకప్పటి సీనియర్ హీరోయిన్ రంభ గురించి ఎలాంటి పరిచయం అవసరం లేదు. ఈమె గతంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి దాదాపు అందరూ అగ్ర హీరోలకు జంటగా నటించింది. గతంలో రంభ‌ క్రేజ్ ఏ స్థాయిలో ఉండేదంటే ప్రస్తుతం యంగ్ హీరోయిన్ శ్రీలీల‌కు ఎంత క్రేజ్ ఉందో అప్పట్లో రంభ‌కు కూడా అదే క్రేజ్‌లో దూసుకుపోయింది. అలాంటి రంభ కేవలం తెలుగులోనే కాకుండా అన్ని భాషల్లో సినిమాలు చేసింది. ఇక అప్పట్లో రంభ తన అందచందాలతో ఇప్పటి యువతకు చెమటలు పట్టించింది.

అయితే అప్పట్లో చాలామందికి రంభ విషయంలో ఒక డౌట్ వచ్చేది.. ఆ సమయంలో ఉన్న అందరూ స్టార్ హీరోలతో రంభ‌ సినిమాలు చేస్తూ వచ్చింది. ఒక నాగార్జునతో మాత్రం ఆమె ఒక్క‌టంటే ఒక సినిమా కూడా చేయలేదు అనే విషయం మాత్రం చాలామందిలో రకరకాల అనుమానాలకు దారితీసింది.
అయితే అందుకు అసలు కారణం ఏమిటో ఇప్పుడు చూద్దాం. రంభని హీరోయిన్‌గా చిత్రపరిశ్రమకు పరిచయం చేసింది సీనియర్ దర్శకుడు ఈవివి సత్యనారాయణ. అందుకే ఆయన ఏ సినిమా చేయమన్నా కూడా రంభ ఆయన మాట కాదనకుండా సినిమాలు చేసుకుంటూ వచ్చింది. అందులో భాగంగానే నాగార్జున హీరోగా వచ్చిన హలో బ్రదర్ సినిమాలో రంభకు అవకాశం వచ్చింది.

అయితే ఈ సినిమాలో నాగార్జున మాత్రం సౌందర్య తో పాటు రంభ‌ను కాకుండా రమ్యకృష్ణను కచ్చితంగా హీరోయిన్గా తీసుకోవాలని పట్టుబట్టడంతో దర్శకుడు ఇవివి సత్యనారాయణ చేసేదేమీ లేక రంభను ఆ సినిమా నుంచి తప్పుకోమన్నారట. కానీ రంభ హలో బ్రదర్ సినిమా కోసం తనకి వచ్చిన రెండు భారీ సినిమా ఆఫర్లు కూడా వదులుకొని ఈ సినిమా చేయడానికి సిద్ధపడిందట. అయితే ఈ సినిమా నుంచి తప్పించడానికి ఇవివి సత్యనారాయణ జరిగిన విషయం మొత్తం చెప్పి కాస్త సర్దుకుపో అని చెప్పేసరికి గురువుగా భావించిన దర్శకులు మాటను కాదనలేక మాట్లాడకుండా ఉండి పోయిందట.

అంతేకాకుండా ఆయన అంతలా రిక్వెస్ట్ చేయడం కారణంగా హలో బ్రదర్ సినిమాలో రంభ ఓ స్పెషల్ సాంగ్ లో కూడా నటించింది. ఆ సాంగ్లో నటించిన తర్వాత తనని వేరే హీరోయిన్ కోసం ఈ సినిమా నుంచి తప్పించాడు నాగార్జున.. ఇక అప్పటినుంచి నాగార్జునతో ఎలాంటి సినిమా ఆకాశం వచ్చినా కూడా నటించకూడదు అని రంభ‌ కఠినమైన నిర్ణయం తీసుకుంది. ఆ కారణంతోనే రంభ- నాగార్జున కాంబినేషన్లో ఒక్క సినిమా కూడా రాలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news