నటి అమలాపాల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆమె చాలా మంచి నటి. అలాగే సంచలన నటి.. వివాదాస్పద నటి అని కూడా చెప్పాలి. మైనా సినిమాతో కోలీవుడ్లో హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకున్న అమల ఆ తర్వాత వరుసగా పలు స్టార్ హీరోల సినిమాలలో నటించి స్టార్ హీరోయిన్గా ఎదిగింది. విజయ్, ధనుష్ వంటి ప్రముఖ నటుల సరసన నటించిన అమలాపాల్ తెలుగులోనూ చాలా సినిమాలు చేసింది. నటిగా మంచి పిక్ లో ఉండగానే దర్శకుడు ఏ ఎల్ విజయ్ ని ఆమె ప్రేమ వివాహం చేసుకుంది. పెళ్లయ్యాక రెండేళ్లలోపే వీరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకున్నారు.
అమలకు విడాకులు ఇచ్చేశాక ఆమె మాజీ భర్త విజయ్ మరో పెళ్లి చేసుకున్నాడు. అమలాపాల్ మాత్రం ఇంకా పెళ్లి చేసుకోకుండా సింగల్ గానే జీవనాన్ని కొనసాగిస్తుంది. ఇదిలా ఉంటే తాజాగా అమలాపాల్ చేసిన కామెంట్లకు సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. తన జీవితంలో మోసపోయాను అనడం కంటే మోసగించబడ్డానని చెప్పాలని తెలిపింది. కరోనా సమయంలో రెండేళ్ల పాటు ఇంట్లో కూర్చుని చాలా బాధపడ్డానని.. తన పరిస్థితి చూసి తనకంటే ఎక్కువగా తన తల్లి బాధపడిందని చెప్పింది.
ఇదిలా ఉంటే అమలాపాల్ తమిళ హీరో ధనుష్ మధ్య బంధంపై గత నాలుగైదు సంవత్సరాలుగా వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ క్లోజ్ గా ఉండటం వల్లే అమలకు తన మాజీ భర్త విజయ్ విడాకులు ఇచ్చేశాడన్న ప్రచారం కూడా ఉంది. ఒక సందర్భంలో విజయ్ తండ్రి మాట్లాడుతూ కేవలం ధనుష్ వల్లే తన కొడుకు జీవితం నాశనం అయిందని.. అమలకు విడాకులు ఇవ్వాల్సి వచ్చిందని కూడా చెప్పాడు. అయితే తాజాగా ధనుష్ 50వ సినిమాలోను అమలాపాల్ హీరోయిన్గా నటిస్తోంది.
దీంతో తమిళ మీడియాలో మరొకసారి వీరిద్దరి బంధంపై పుకార్లు గుప్పమంటున్నాయి. ఇక అమలాపాల్ – ధనుష్ మధ్య సంబంధం గురించి వార్తలు బాగా వైరల్ అయిన తర్వాతే ధనుష్ తన భార్య ఐశ్వర్యకు కూడా విడాకులు ఇచ్చేసి అందరికీ షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టాలీవుడ్ లో వినిపిస్తున్న చర్చల ప్రకారం అమలాపాల్ ..ధనుష్ ఎప్పుడైనా పెళ్లి చేసుకోవచ్చని చెబుతున్నారు.