Moviesఆ సినిమాకి అవార్డు రాలేదని తెగ బాధపడుతున్న నాని.. పోస్ట్ వైరల్..!!

ఆ సినిమాకి అవార్డు రాలేదని తెగ బాధపడుతున్న నాని.. పోస్ట్ వైరల్..!!

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సరే పుష్ప – ఆర్ఆర్ఆర్ పేర్లే ఓ రేంజ్ లో మారుమ్రోగిపోతున్నాయి. ఈ ఏడాది తెలుగు సినిమాలకు పది నేషనల్ అవార్డులు అందడం గర్వకారణం అనే చెప్పాలి. అలాగే 69 ఏళ్లుగా ఒక తీరని కలలా ఉన్న బెస్ట్ యాక్టర్ అవార్డు కూడా వరించడంతో టాలీవుడ్ అంతా ఫుల్ ఖుషి ఖుషి లో ఉంది .

రీసెంట్ గా 69వ జాతీయ అవార్డుల విన్నింగ్ లిస్టును రిలీజ్ చేశారు నిర్వాహకులు . ఈ క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా ఉన్న అల్లు అర్జున్ బెస్ట్ యాక్టర్ గా అవార్డు అందుకున్నాడు. పుష్ప సినిమాకి గాను ఈ అవార్డు వరించింది . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఆయన పేరు మారుమ్రోగి పోతుంది . కాగా ఆర్ఆర్ఆర్ సినిమాకు గాను ఏకంగా 6 కేటగిరిలో అవార్డులు వచ్చాయి . ఉప్పెన సినిమా ది బెస్ట్ మూవీ గా అవార్డు దక్కించుకుంది.

అయితే టాలీవుడ్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న నాని ఈ సినిమాలకు అవార్డు రావడం పట్ల సంతోషంగానే ఉన్న ఓ సినిమాకి అవార్డు రాలేకపోయింది అన్న బాధ ఉంది అంటూ ఓపెన్ గా చెప్పుకొచ్చారు . ఈ క్రమంలోనే తన ఇన్స్టా స్టోరీలో ఒక పోస్ట్ వేయగానే అది కాస్త వైరల్ అవుతుంది. ఆ పోస్ట్ లో ఏం రాశాడు అంటే తమిళ్ యాక్టర్ సూర్య జై భీమ్ సినిమాకు అవార్డు రాకపోవడం తో తన హార్ట్ బ్రేక్ అయిందని తెలియజేస్తూ హార్ట్ బ్రేక్ సింబల్ స్టోరీ లో పెట్టాడు . దీని పై అభిమానులు భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు .

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news