Moviesనాగార్జున చేజేతులా వ‌దులుకున్న రెండు ఇండ‌స్ట్రీ హిట్లు… చిరుకు పోటీ అయ్యేవాడు..!

నాగార్జున చేజేతులా వ‌దులుకున్న రెండు ఇండ‌స్ట్రీ హిట్లు… చిరుకు పోటీ అయ్యేవాడు..!

ఏ రంగంలో అయినా ఎప్పుడు ఒకరు ఆలోచనలు మరొకరికి నచ్చవు అలాగే ఏ ఒక్కరి మైండ్ సెట్ ఒకేలా ఉండదు. ఇది నిజం. ఇది సినిమా ఇండస్ట్రీకి కూడా తీసిపోదు. అందుకే ఒక్కోసారి ఒక హీరో చేయాల్సిన సినిమా కథలు మరో హీరో దగ్గరకు వెళుతూ ఉంటాయి. ఒక హీరో రిజెక్ట్ చేసిన సినిమాను మరో హీరో చేస్తూ ఉంటాడు. అలా చేతులు మారిన సినిమాలు కొన్నిసార్లు బంపర్ హిట్లు అవుతుంటే కొన్నిసార్లు అట్టర్ ప్లాప్ అవుతుంటాయి. తాము వదులుకున్న సినిమా సూపర్ హిట్ అయితే ఆ హీరో మంచి హిట్ సినిమా మిస్ అయ్యామని ఫీల్ అవుతూ ఉంటారు.’

అదే డిజాస్టర్ అయితే తమ అంచనా కరెక్ట్ అయిందని తాము డిజాస్టర్ సినిమా తప్పించుకున్నాను అని హ్యాపీ ఫీలవుతారు. ఇలా టాలీవుడ్ కింగ్ నాగార్జున తన సినీ కెరీర్లో రెండు ఇండస్ట్రీ హిట్ సినిమాలను చేతులారా వదులుకున్నారు. ముందుగా విక్టరీ వెంకటేష్ సిమ్రాన్ జంటగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా కలిసుందాం రా. 2000 సంవత్సరం సంక్రాంతికి రిలీజ్ అయిన ఈ సినిమా కంప్లీట్ లవ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా వచ్చి అప్పట్లో బాక్సాఫీసును కొల్లగొట్టి ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. తమిళ దర్శకుడు ఉదయ శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఓ తమిళ రీమిక్‌ సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది.

సురేష్ ప్రొడక్షన్స్ పై వెంకటేష్ అన్న సురేష్ బాబు ఈ సినిమాను నిర్మించారు. వాస్తవానికి దర్శకుడు ఉదయ్ ఈ సినిమా కథను ముందుగా నాగార్జునకు చెప్పారట. అప్పటికే నాగార్జున వరుసగా ఫ్యామిలీ సినిమాలు చేస్తుండడంతో ఈ కథను సున్నితంగా తిరస్కరించడంతో అలా కలిసుందాం రా వెంకటేష్ చేతుల్లోకి వచ్చింది. ఇక రెండో సినిమా మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా గ్యాంగ్ లీడర్. శ్యామ్‌ ప్రసాద్ బ్యానర్ పై మాగంటి రవీంద్రనాథ్ చౌదరి నిర్మించిన ఈ సినిమాకు విజయ బాపినాడు దర్శికుడు.

ఇక‌ చిరంజీవికి జోడిగా విజయశాంతి నటించిన ఈ సినిమా 1991 లో వచ్చి బాక్సాఫీస్ వద్ద ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకు కూడా మొదట నిర్మాతలు నాగార్జుననే హీరోగా అనుకున్నారట. అయితే అలాంటి పవర్ఫుల్ యాక్షన్ సినిమా తనకు ఎంతవరకు సెట్ అవుతుంది అన్న సందేహంతో నాగార్జున వదులుకోవడంతో ఆ సినిమా కథ కూడా చిరంజీవి దగ్గరికి వెళ్ళింది. అలా నాగార్జున తన కెరీర్ లో రెండు సూపర్ డూపర్ హిట్ సినిమాలను చేజేతులా వదులుకున్నారు. ఈ రెండు సినిమాలు నాగార్జున చేసి ఉంటే కచ్చితంగా అప్పట్లో ఆయన వెంకటేష్- చిరంజీవికి గట్టి పోటీ హీరో అయి ఉండేవారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news