ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ పేరు ఏ రేంజ్ లో వైరల్ అవుతుందో మనకు తెలిసిందే. దానికి కారణం రీసెంట్గా మోక్షజ్ఞ నందమూరి ఆడపడుచు సుహాసిని కొడుకు పెళ్లిలో మెరవడమే . చాలా స్టైలిష్ గా.. ట్రెండీగా ..హ్యాండ్సమ్ గా కనిపించాడు మోక్షజ్ఞ . ముందు మోక్షజ్ఞ కొంచెం బొద్దుగా ఉండేవాడు అని అందరికీ తెలిసిందే .
కానీ సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా రావడానికి తన లుక్స్ మొత్తం మార్చేశారు. కాగా సుహాసిని కొడుకు పెళ్లిలో నందమూరి మోక్షజ్ఞ స్పెషల్ గా కనిపించారు . ఇదే పెళ్లికి జూనియర్ ఎన్టీఆర్ – నందమూరి కళ్యాణ్ రామ్ కూడా హాజరయ్యారు. ఈ క్రమంలోనే అన్నలతో కలిసి మోక్షజ్ఞ చేసిన సందడి చాలా వైరల్ గా మారింది . అంతే కాదు ఎన్టీఆర్ పై ఉన్న అభిమానాన్ని ట్విట్టర్ వేదికగా మోక్షజ్ఞ మరోసారి ఫోటోలతో పోస్ట్ చేసి అన్నపై ఉన్న ప్రేమను చాటుకున్నాడు .
అయితే బాలయ్య – ఎన్టీఆర్ కన్నా మోక్షజ్ఞ ఆ విషయంలో సూపర్ అని ట్రెండ్ చేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్. నిజానికి బాలయ్యకి ఎన్టీఆర్ కి చాలా కోపం ఎక్కువ ..ఉన్నది ఉన్నట్లు ప్రవర్తించేస్తారు . ఆ సందర్భాలు మనం ఎన్నో చూసాం . అయితే మోక్షజ్ఞ మాత్రం చాలా రిజర్వడ్.. వెల్ మెచ్యూర్డ్ ..ఎక్కడ ఎలా ప్రవర్తించాలి .. ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి .. ఎవరిని ఎలా పలకరించాలి అనే విషయం బాగా తెలుసు. చాలా బాగా కోపాన్ని కంట్రోల్ చేసుకునే కెపాసిటీ మోక్షజ్ఞకు ఉంది. ఆ విధంగా చూసుకుంటే బాలయ్య ఎన్టీఆర్ కన్నా కోపాన్ని కంట్రోల్ చేసుకోవడంలో మోక్షజ్ఞ ది బెస్ట్ అని చెప్పాలి . దీంతో సోషల్ మీడియాలో మోక్షజ్ఞ పేరు వైరల్ గా మారింది..!!