Moviesశ్రీలీలతో మోక్షజ్ఞ ముచ్చట్లు.. కేకపెట్టిస్తున్న కొత్త జోడి..ఎంత క్యూట్ గా ఉన్నారో..!!

శ్రీలీలతో మోక్షజ్ఞ ముచ్చట్లు.. కేకపెట్టిస్తున్న కొత్త జోడి..ఎంత క్యూట్ గా ఉన్నారో..!!

టాలీవుడ్ నరసింహం గా పాపులారిటీ సంపాదించుకున్న నందమూరి బాలయ్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా భగవంత్ కేసరి . అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రజెంట్ సెట్స్ పై ఉంది . అక్టోబర్ 19న గ్రాండ్గా థియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో బాలయ్య సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. ఆయన కూతురి పాత్రలో యంగ్ బ్యూటీ నటిస్తుంది .

ఈ క్రమంలోనే రీసెంట్గా ఈ సినిమా సెట్స్ లో పాల్గొన్నాడు నందమూరి బాలయ్య కొడుకు మోక్షజ్ఞ . దానికి సంబంధించిన ఫొటోస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారాయి . శ్రీ లీల – మోక్షజ్ఞ మాట్లాడుతున్న ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హాట్ టాపిక్ ట్రెండ్ అవుతున్నాయి. వీళ్లిద్దరి ఈడు జోడు బాగా కుదిరింది అంటున్నారు నందమూరి అభిమానులు. అంతేకాదు మోక్షజ్ఞ డెబ్యూ సినిమాకి శ్రీ లీల హీరోయిన్ అయితే చాలా ప్లస్ అవుతుందని జంట కూడా బాగుండడంతో వీళ్ళ జోడి అందరికీ నచ్చుతుందని చెప్పుకొస్తున్నారు .

అంతేకాదు మోక్షజ్ఞ చూడడానికి చాలా స్టైలిష్ గా యంగ్ లుక్స్ లో అదరగొట్టేస్తున్నాడు. సినిమా ఇండస్ట్రీ లోకి వస్తే కచ్చితంగా ఇప్పుడున్న హీరోలకి గట్టి కాంపిటీషన్ ఇస్తాడు అంటున్నారు నందమూరి అభిమానులు. ప్రజెంట్ ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news