Moviesమెగా హీరోలు చుక్క‌ల్లో రెమ్యున‌రేష‌న్లు… నిండా మునుగుతోన్న నిర్మాత‌లు…!

మెగా హీరోలు చుక్క‌ల్లో రెమ్యున‌రేష‌న్లు… నిండా మునుగుతోన్న నిర్మాత‌లు…!

టాలీవుడ్ లో మెగా హీరోలు ఓ చిన్న సైజు క్రికెట్ టీం మాదిరిగా తయారయ్యారు. యేడాదిలో సగటున మెగా హీరోలు నటిస్తున్న పదికి పైగా సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే ఇటీవల కాలంలో మెగా హీరోల రెమ్యూనరేషన్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి అన్న చర్చిలో అయితే టాలీవుడ్ లో గట్టిగా వినిపిస్తున్నాయి. వాళ్లు అడిగినంత నిర్మాతలు ఇచ్చి సినిమాలు తీస్తున్నారు. అయితే వాళ్లకు ఇచ్చిన రెమ్యూనరేషన్ రేంజ్ లో సినిమా మార్కెట్ కావడం లేదు.

సినిమాలు డిజాస్టర్లు అవుతుండడంతో నిర్మాతలు నిండా మునిగిపోతున్నారు. అదే మెగా హీరోలు తీసుకునే రెమ్యూనరేషన్లు మిడిల్ రేంజ్ లో ఉంటే నిర్మాతలకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. అయితే సినిమా సినిమాకు వాళ్ళు రెమ్యున‌రేషన్లు పెంచుకుంటూ పోతున్నారు. పైగా సినిమాలు డిజాస్టర్లు అవుతున్నాయి. మినిమం ఓపెనింగ్స్ కూడా రావ‌డం లేదు. దీంతో నిర్మాతలు కోట్లలో నష్టపోతున్నారు. సాయిధర‌మ్‌తేజ్ ఇప్పటివరకు ఎనిమిది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకుంటూ వచ్చారు.. ఇప్పుడు ఐదు కోట్లు పెంచేసి 13 కోట్లు అడుగుతున్నారని టాక్ ఉంది.

ఇక వరుణ్ తేజ్ కు ఎఫ్2 – ఎఫ్3 – గద్దలకొండ గణేష్ తప్ప మరో హిట్టు తన ఖాతాలో లేదు. పైగా చాలా డిజాస్టర్లు ఉన్నాయి. గత ఏడాది గని – తాజాగా గాండీవ ధారి అర్జున‌ సినిమాలు ఒక్కో సినిమా రు. 20 కోట్ల నష్టాలు తెచ్చిపెట్టాయి. వ‌రుణ్ గాంధీవ‌దారి సినిమాకు తొమ్మిది కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నాడు అన్న టాక్ ఉంది. అయితే ఇప్పుడు దానిని 12 కోట్లకు పెంచేసినట్టు తెలుస్తోంది. ఇక ఉప్పెన సినిమాతో హిట్టు కొట్టిన వైష్ణవ్ తేజ్ తర్వాత సినిమాలు ప్లాప్‌ అయ్యాయి. ఇప్పుడు వైష్ణవ్‌ కూడా 6రు నుంచి 8 కోట్ల రేంజ్ లో రెమ్యూనరేషన్ అడుగుతున్నట్టు సమాచారం.

ఇక మెగాస్టార్ చిరంజీవి అయితే భోళాశంకర్ సినిమాకు ఖర్చులతో కలిపి 70 కోట్లు తీసుకున్నాడు అన్న ప్రచారం జరిగింది. సినిమా ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో తెలిసిందే. చివరకు చిరు 10 కోట్ల రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్టు ప్రచారం జరుగుతున్నా అంత పెద్ద డిజాస్టర్ సినిమాకు 60 కోట్ల రెమ్యూనరేషన్ అంటే చాలా ఎక్కువ. ఇక ప‌వ‌న్ బ్రో సినిమాకు కేవ‌లం 22 రోజుల షూటింగ్ చేసి రు. 55 – 60 కోట్లు తీసుకున్నాడు. ఇది కూడా చాలా ఎక్కువ‌.

ఇక బ‌న్నీకి పాన్ ఇండియా రేంజ్‌లో హిట్లు వ‌స్తున్నా… త‌న స్థాయికి మించి ఏకంగా రు. 80 – 100 కోట్ల రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నాడు. పుష్ప అంత పెద్ద హిట్ అయినా ఏపీ, తెలంగాణ బ‌య్య‌ర్లు చాలా ఏరియాల్లో న‌ష్ట‌పోయారు. ఏదేమైనా మెగా హీరోలు త‌మ సినిమాల రెమ్యున‌రేష‌న్‌లు త‌గ్గించుకోక‌పోతే వారితో సినిమాలు తీసిన నిర్మాత‌లు… వాళ్ల సినిమాలు కొన్న బ‌య్య‌ర్లకు రూపాయి లాభం అయితే రాదు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news