భారత దిగ్గజ దర్శకుడు ఎస్.ఎస్ రాజమౌళి – టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు కాంబినేషన్లో తెరకెక్కే సినిమాపై దేశవ్యాప్తంగా ఏ స్థాయిలో ? అంచనాలు ఉన్నాయో చెప్పక్కర్లేదు. ఈ సినిమా ఉంటుందని ప్రకటన వచ్చిన రోజు నుంచి ఎప్పుడు ? సెట్స్ మీదకు వెళుతుందా అన్న ఒక్కటే ఉత్కంఠ ఇండియన్ సినీ జనాల్లో నెలకొంది. త్రిబుల్ ఆర్ సినిమా తర్వాత రాజమౌళి చేస్తున్న ప్రాజెక్టు కూడా ఇదే.
ఇక ఈ సినిమా కథను కూడా రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ అందిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాను దుర్గా ఆర్ట్స్ బ్యానర్ పై కే ఎల్ నారాయణ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. తాజాగా ఈ ప్రాజెక్టుపై రచయిత విజయేంద్ర ప్రసాద్ స్పందించారు. ఆఫ్రికా యాక్షన్ అడ్వెంచర్ సినిమాగా మహేష్ బాబుతో కథ సిద్ధం చేస్తున్నానని.. ఈ సినిమాలో యాక్షన్ సీన్లు ఇండియానా జోన్స్ సినిమా టైపులో ఉంటాయని ఉదాహరణగా తెలిపారు.
ఈ సినిమా కోసం హాలీవుడ్ నటులు.. టెక్నీషియన్లు కూడా పనిచేస్తున్నారని.. ఈ సినిమా హాలీవుడ్ రేంజ్ లో రిలీజ్ చేస్తామని చెప్పకనే చెప్పారు. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాని ఫ్రాంచైజీగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానట్టు విజయేంద్ర ప్రసాద్ గతంలోని చెప్పారు. సీక్వెల్స్ లో కథలు మారుతాయి కానీ.. ప్రధానోపాత్రల మాత్రం అవే ఉంటాయని విజయేంద్ర ప్రసాద్ స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.
2024 లో ఈ సినిమా సెట్స్ మీదకు వెళుతుంది. ప్రస్తుతం మహేష్ బాబు – త్రివిక్రమ్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాతో బిజీగా ఉన్నారు. అతడు – ఖలేజా సినిమాల తర్వాత మహేష్.. త్రివిక్రమ్ కాంబినేషన్లో వస్తున్న మూడో సినిమా ఇది. కంప్లీట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కే ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 12న వరల్డ్ వైడ్‌గా రిలీజ్ కానుంది.