టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఎంత క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పుకోవలసిన అవసరం లేదు. మహేష్ బాబు జీన్స్ లోనే సినిమా రక్తం ఉంది.. మహేష్ చిన్నప్పటి నుంచే పలు సినిమాలలో అద్భుతంగా నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. స్వయంగా తన తండ్రి కృష్ణ దర్శకత్వం వహించిన బాలచంద్రుడు సినిమాతో బాల నటుడుగా మహేష్ బాబు వెండితెరకు పరిచయం అయ్యాడు.
అప్పట్లో ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద హిట్ అయింది. ఆ తర్వాత కొడుకులు దిద్దిన కాపురం లో కూడా మహేష్ బాబు తన రోల్ తో అదరగొట్టేశాడు. ఇక మహేష్ తొలి సినిమా బాలచంద్రుడు సినిమాకు ఆ రోజుల్లోనే ఒక స్టార్ హీరో సినిమాకు ఎంత ? కలెక్షన్లు వస్తాయో.. అంతే స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఆ రోజుల్లో ఈ సినిమా దాదాపు నాలుగు కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రాబట్టింది. ఈ సినిమా విజయంలో మహేష్ బాబు క్రెడిట్ చాలా ఉందని చెప్పాలి.
అప్పట్లో చిన్న వయసులోనే మహేష్ వేసే డ్యాన్సులు.. ఫైట్లు చూసి తెలుగు ప్రేక్షకుల ఆశ్చర్యపోయారు. ఇప్పటికీ కూడా మహేష్ నటించిన చిన్నప్పటి సినిమాల వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతూ ఉంటాయి. నెటిజన్లు కూడా ముద్దుగా ఉండే మహేష్ ని చూసి కామెంట్లు పెడుతూ ఉంటారు. ఇక మహేష్ 1999లో కే రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన రాజకుమారుడు సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు.
వైజయంతి మూవీస్ బ్యానర్‌పై చలసాని అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమాలో మహేష్ కు జోడిగా ప్రీతిజింతా హీరోయిన్గా నటించింది. రాజకుమారుడు సంచలన విజయం సాధించడంతో పాటు 45 కేంద్రాలలో వంద రోజులు పూర్తి చేసుకుంది. ఇక మహేష్ ప్రస్తుతం మాటల మంత్రకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో గుంటూరు కారం సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత రాజమౌళి తెరకెక్కించే సినిమాలో మహేష్ నటిస్తాడు.