ప్రజెంట్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో ఎక్కడ చూసిన సరే హీరోయిన్ లావణ్య త్రిపాఠి.. హీరో వరుణ్ తేజ్ ల పేర్లు మారుమ్రోగి పోతున్నాయి . ఇన్నాళ్లు సైలెంట్ గా గుట్టుచప్పుడు కాకుండా ప్రేమాయణం నడిపిన ఈ జంట ..జూన్ 9వ తేదీన గ్రాండ్గా అంగరంగ వైభవంగా నాగబాబు నివాసంలో నిశ్చితార్థం చేసుకుంది. అప్పటినుంచి సోషల్ మీడియాలో = వీళ్ళకి సంబంధించిన వార్తలు ట్రెండ్ అవుతున్నాయి.
త్వరలోనే వరుణ్ తేజ్ నటించిన గాండీవ దారి అర్జున రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలోనే ఆయనకు సంబంధించిన విషయాలను సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు కొందరు జనాలు . ఇలాంటి క్రమంలోనే వరుణ్ తేజ్ కోసం మెగా కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి ఏ ఆడపిల్ల చేయనటువంటి పని చేయబోతుంది అంటూ ప్రచారం చేస్తున్నారు . లావణ్య త్రిపాఠి పెళ్లికి ముందు తన ఇంటి పేరుని కొణిదెలగా మార్చుకోబోతుందట .
ఏ ఆడపిల్ల కైనా పెళ్లి తర్వాత తన ఇంటిపేరు మారుతుంది. అయితే మెగా కోడలు కాబోతున్న లావణ్య త్రిపాఠి కూసింత తొందరగానే తన ఇంటి పేరును మార్చుకోవడానికి సిద్ధపడిందట. త్వరలోనే సోషల్ మీడియా అకౌంట్స్ లో కూడా ఆమె పేరు కొణిదెల ఫ్యామిలీతో అటాచ్ చేసి అప్డేట్ చేయనున్నట్లు తెలుస్తుంది. దీంతో వరుణ్ తేజ్ ఎంత లక్కి.. తనకోసం పెళ్ళికి ముందే ఇంటి పేరుని మార్చుకునేసే భార్య దొరికింది ..గ్రేట్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు..!!