Moviesమాంచి రొమాంటిక్ మూడ్‌లో నితిన్ భార్య‌…. భ‌ర్త‌తో క‌లిసి ఏం చేస్తుందో...

మాంచి రొమాంటిక్ మూడ్‌లో నితిన్ భార్య‌…. భ‌ర్త‌తో క‌లిసి ఏం చేస్తుందో చూడండి..!

టాలీవుడ్ యంగ్ హీరో నితిన్ ప్రస్తుతం వక్కంతం వంశీ దర్శకత్వంలో ఎక్స్ ట్రా ఆర్డినరీ మ్యాన్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవ‌లే ఈ సినిమా మేకర్స్ ఈ సినిమా ఫస్ట్ లుక్ టైటిల్ రిలీజ్ చేశారు. అలాగే హరీష్ జయరాజ్ స్వరపరిచిన డేంజర్ పిల్ల సాంగ్ కూడా రిలీజ్ చేశారు. ఈ సాంగ్ యూట్యూబ్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ దూసుకుపోతోంది.

కాగా షూటింగుకు కొంత గ్యాప్ రావడంతో హీరో నితిన్ తన భార్య షాలిని కందుకూరితో కలిసి రొమాంటిక్ వెడ్డింగ్ యావర్సరీ సెలబ్రేట్ చేసుకునేందుకు స్పైయిన్ లోని బార్సిలోనా వెళ్లాడు. వీరిద్దరూ నాలుగు ఏళ్లపాటు ప్రేమలో ఉండి 2020 జూలైలో కుటుంబ సభ్యుల సమక్షంలో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక షాలిని తల్లిదండ్రులు ఇద్దరు డాక్టర్లు. వీరికి ప్రజారాజ్యం పార్టీ నుంచి రాజకీయ అనుభవం కూడా ఉంది.

పెళ్లి తర్వాత మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తున్న నితిన్, షాలిని తాజాగా స్పెయిన్ లో వెకేషన్ బాగా ఎంజాయ్ చేస్తున్నట్టు ఉన్నారు. షాలిని తన భర్త నితిన్ కౌగిలిలో రొమాంటిక్ గా ఉన్న పిక్ నెట్ ఇంట షేర్ చేసింది. మూడేళ్లు ఎంతో అందంగా గడిచాయి థాంక్యూ అని కామెంట్ కూడా రాసుకొచ్చింది షాలిని. దీంతో నెటిజన్లు మోస్ట్ రొమాంటిక్ కపుల్.. మీ లైఫ్ ఎల్లప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కురిపిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news