సాధారణంగా డైరెక్షన్ విభాగంలో పనిచేసేవారికి బాధ్యతలు ఎక్కువగానే ఉంటాయి. వారు అనేక మంది నటీనటులతో నటించేలా చేయడమే కాదు… కథ, సంగీతం, పోస్టు ప్రొడక్షన్ వంటి అనేక కార్యక్రమాల్లో దర్శకులు బిజీగా ఉంటారు. దీంతో సహజంగానే దర్శకులపై ఒత్తిడి ఉంటుంది. అయినప్పటికీ.. చాలా మంది దర్శకులు మాత్రం తమకంటూ ప్రత్యేక శైలిని ఏర్పాటు చేసుకుని ముందుకు సాగేవారు.
ఈ క్రమంలో చాలా మంది హీరోయిన్లతో ఎంత వరకు వ్యవహరించాలో.. అంతవరకే ఉండేవారట. కానీ.. ఒకరిద్దరు దర్శకులు మాత్రం..హీరోయిన్ను ముట్టుకోకుండా మాత్రం దర్శకత్వం చేసేవారు కాదని అంటా రు. ఇలాంటి వారిలో అగ్రదర్శకుల పేర్లే ఉన్నాయి. వీరిలో చాలా మంది హీరోయిన్ల బుగ్గలు. పెదాలు.. నడుము భాగంపై కూడా చేతులు వేసి.. దర్శకత్వం వహించేవారట.
ఈ విషయం.. కొన్నేళ్ల కిందట తమిళ ఇండస్ట్రీలో ఓ దర్శకుడిపై హీరోయిన్ ఫిర్యాదు చేసిన నేపథ్యంలో అసలు ఇండస్ట్రీలో ఏం జరుగుతోందనే విషయంపై చర్చకు వచ్చింది. దీంతో అలనాటి సంగతులు కూడా తెరమీదికి వచ్చాయి. ఇప్పుడేముంది.. అప్పట్లో అయితే.. అన్ని చూసేవారు. అయినా.. ఒక సినిమాకు లక్షల రూపాయలు పెట్టుబడులు పెట్టేప్పుడు.. ఆ మాత్రం తమకు కావాల్సిన మేరకు అందాలు ఉన్నాయో లేవో చూడ్డంతప్పు కాదు
అని సమర్ధించిన వారు కూడా ఉన్నారు.
బాలచందర్, బాలు మహేంద్ర, కమలాకర కామేశ్వరరావు, కే. విశ్వనాథ్, కే. రాఘవేంద్ర రావు, ఆర్బి. చౌదరి, జేడీ వంటి అనేక మంది.. హీరోయిన్లను తడిమి చూసుకునేవారని.. కొన్ని కొన్ని సీన్లలో వారితో అత్యంత చనువుగా కూడా వ్యవహరించేవారని ఒక టాక్ ఉంది.