Moviesప్ర‌భాస్ ' స‌లార్ ' జోరు… షారుక్ ' జ‌వాన్ '...

ప్ర‌భాస్ ‘ స‌లార్ ‘ జోరు… షారుక్ ‘ జ‌వాన్ ‘ బేజారు… !

ప్రస్తుతం పాన్ ఇండియా సినిమా దగ్గర భారీ అంచనాలు ఉన్న రెండు పెద్ద సినిమాలు సెప్టెంబ‌ర్‌లో రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. ఇందులో యంగ్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ న‌టిస్తోన్న స‌లార్ సినిమాతో పాటు షారుక్ ఖాన్ జ‌వాన్ సినిమాలు రెండు ఉన్నాయి. జ‌వాన్ సినిమా పేరుకు మాత్ర‌మే బాలీవుడ్ హీరో షారుక్ ఖాన్ న‌టిస్తోన్న సినిమా అయినా కూడా ఇందులో హీరోయిన్ న‌య‌న‌తార కావ‌డం.. డైరెక్ట‌ర్ అట్లీ కోలీవుడ్ డైరెక్ట‌ర్ కావ‌డంతో సౌత్‌లో కూడా జ‌వాన్ మీద అంచ‌నాలు ఉన్నాయి.

ఇక స‌లార్ సినిమా మీద క‌నివినీ ఎరుగ‌ని రేంజ్‌లో అంచ‌నాలు ఉన్నాయి. కేజీయ‌ఫ్ సీరిస్ సినిమాల త‌ర్వాత ప్ర‌శాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న సినిమా కావ‌డంతో అంచ‌నాలు అయితే ఆకాశంలోనే ఉన్నాయి. పైగా బాహుబ‌లి సీరిస్ సినిమాల త‌ర్వాత ఆ రేంజ్ అంచ‌నాల‌తో ప్రభాస్ నుంచి ఈ పాన్ ఇండియా సినిమా వ‌స్తోంది. సెప్టెంబ‌ర్ 28న స‌లార్ థియేట‌ర్ల‌లోకి దిగుతోంది.

ఇక ఇప్ప‌టికే టీజ‌ర్ రిలీజ్ అయిన స‌లార్ సినిమా మానియా మ‌రో రేంజ్‌కు వెళ్లింది. ఇటు ఇండియా నుంచి అటు యూఎస్ వ‌ర‌కు మొత్తం స‌లార్ కంప్లీట్‌గా షారుక్ జ‌వాన్ సినిమాను డామినేట్ చేసి ప‌డేస్తోంది. ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ల మ‌ధ్య చాలా తేడా ఉన్నా కూడా ఇండియాలో బుక్ మై షో ఇంట్రెస్ట్స్ గాని సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో కానీ సలార్ జోరు ముందు షారుక్ బేజారు అయిపోయాడు.

అస‌లు స‌లార్‌లో జ‌వాన్ బుకింగ్స్ స‌లార్‌తో పోలిస్తే చాలా చాలా త‌క్కువుగా ఉన్నాయి. ఏదేమైనా జ‌వాన్ కంటే స‌లార్ చాలా సంచ‌ల‌న రికార్డులు న‌మోదు చేయ‌బోతోంద‌ని ట్రెండ్స్ చెప్పేస్తున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news