Moviesబ‌న్నీ - చెర్రీని బూతులు తిట్టుకుంటోన్న మెగా ఫ్యాన్స్‌… నిట్ట నిలువునా...

బ‌న్నీ – చెర్రీని బూతులు తిట్టుకుంటోన్న మెగా ఫ్యాన్స్‌… నిట్ట నిలువునా చీలిపోయారు..!

అవును.. మెగా అభిమానులు రెండుగా చీలిపోయారు. అసలు గత రెండు, మూడు సంవత్సరాల నుంచి ఇద్దరు మెగా హీరోలు బన్నీ- చెర్రీ మధ్య జరుగుతున్న ఆధిపత్య పోరులో అభిమానుల మధ్య చీలిక మొదలైంది. అసలు అంతకుముందే రుద్రమదేవి సినిమా ఫంక్షన్ లో బన్నీ- పవన్ కళ్యాణ్ అభిమానులను ఉద్దేశించి చెప్పన బ్రదర్ అంటూ వెటకారంగా కామెంట్ చేయడంతో అప్పటి నుంచే మెగా అభిమానులు బన్నీని టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఆ తర్వాత బన్నీ కూడా మెగా కాంపౌండ్ కు దూరంగా తనకంటూ సపరేట్గా అల్లు అర్జున్ ఆర్మీ పేరుతో ప్రత్యేక అభిమాన గణం సొంతం చేసుకున్నాడు.

దీనికి తోడు బన్నీ వరుస హిట్‌ల‌తో పాన్ ఇండియా రేంజ్ లో ఇమేజ్ తెచ్చుకోవడంతో అతడికి సోషల్ మీడియాలో కూడా తిరుగులేని క్రేజ్ వచ్చేసింది. ఆ తర్వాత బన్నీ- చెర్రీ ఇద్దరు కూడా తమ సినిమాలతో ఆధిపత్యం కోసం ప్రయత్నాలు చేశారు. తాజాగా పుష్ప సినిమాకు గాను బన్నీకి జాతీయ స్థాయిలో ఉత్తమ నటుడి అవార్డు వచ్చింది. ఈ అవార్డు కూడా మళ్లీ వీరిద్దరి మధ్య గ్యాప్ బయటపెట్టింది. పవన్ పోస్టుకు స్పందించిన బన్నీ సుదీర్ఘంగా స్పందించాడు. మీ నుంచి మెచ్చుకోలు రావడం నాకు చాలా స్పెషల్ అని కామెంట్ చేశాడు.

ఇక మహేష్ బాబు పెట్టిన పోస్ట్ పై సుదీర్ఘంగా స్పందించాడు. చివరికి చిన్న హీరో శ్రీ విష్ణుకు కూడా డీటెయిల్ గా ధన్యవాదాలు తెలిపారు. కానీ రామ్ చరణ్ కు మాత్రం సింపుల్గా థ్యాంక్స్ అంటూ సరిపెట్టాడు. అయితే అంతకుముందు త్రిబుల్ ఆర్ సినిమా ఆస్కార్ బారిలో నిలిచినప్పుడు బన్నీ తమ ఫ్యామిలీ హీరో చరణ్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా అదే టైంమ్‌లో ఎన్టీఆర్ ను ఆకాశానికి ఎత్తేశాడు. ఇప్పుడు చరణ్ కూడా తన వంతు రావడంతో బన్నీని గుంపులో గోవిందంల‌ కలిపేసి సింపుల్ గా విష్ చేశాడని తెలుస్తోంది. ఈ విషయంలో మెగా అభిమానులు రెండుగా చీలిపోయారు.. కొంతమంది బన్నీని బూతులు తిడుతుంటే అల్లు అర్జున్ ఆర్మీ మాత్రం చరణ్ ను తిట్టిన తిట్టు తిట్టకుండా తిడుతుంది. ఏది ఏమైనా ఈ ఇద్దరు హీరోల అభిమానుల మధ్య ఇప్పట్లో ఈ వార్‌కు ఎండ్ కార్డు పడే సూచనలు అయితే కనిపించడం లేదు. భవిష్యత్తులోనూ ఇది మరింత ముదిరేలా ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news