విలక్షణ నటుడు రఘువరన్ పేరు వినగానే ఆయన విలక్షణమైన పాత్రలు ఎన్నో మన ముందు కదలాడుతూ ఉంటాయి. తాను ధరించిన పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న రఘువరన్ ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్నారు. చివరి రోజుల్లో విపరీతంగా ఆల్కహాల్‌కు బానిస అయిన రఘువరన్ 2008 మార్చి 19న మృతి చెందారు. అయితే చాలా రోజుల తర్వాత రఘువరన్ తమ్ముడు ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అన్నయ్య మరణానికి ముందే కుటుంబంలో కొన్ని సమస్యలు ఉండేవని.. అవి ఆయనకు బాధ కలిగించాయని మానసికంగా, శారీరకంగా అలసిపోయిన అన్నయ్య తన కొడుకును చాలా ప్రేమించాడు.. అప్పటికే అన్నయ్య, రోహిణి వేరువేరుగా ఉండడంతో వారంలో శనివారం మాత్రమే తన కుమారుడిని ఇంటికి తీసుకువచ్చే అవకాశం ఉండేది… ఆదివారం తిరిగి వాళ్ళు తీసుకుపోతారు కోర్టు నిబంధన అలా ఉండేది.. ఆ సమయంలో ఆయన కన్నీరు పెట్టుకునే వాడని రఘువరన్ సోదరుడు చెప్పాడు.
తన కుమారుడు ఎప్పుడైతే ? తిరిగి వెళ్ళిపోతాడో అప్పుడు అన్నయ్య విపరీతంగా బాధపడేవాడని అలా చివరి రోజుల్లో ఎంతో క్షోభ అనుభవించాడు.. దాంతో మద్యానికి మరింత బానిస అయ్యాడని గుర్తు చేసుకున్నాడు. అన్నయ్య మద్యానికి బానిస కావటానికి వ్యక్తిగత కారణాలు కూడా ఉన్నాయి.. అంటూనే పరోక్షంగా రోహిణి అని తెలుపుతూ దీనిపై మాట్లాడే ఆసక్తి లేదని కూడా చెప్పటం విశేషం. అంటే రఘువరన్ సోదరుడు చెబుతున్న దాన్నిబట్టి చివర్లో తన భార్య రోహిణి వల్లే రఘువరన్ విపరీతంగా మద్యానికి బానిస అయ్యాడా ? అన్న అర్థం వచ్చేలా మాట్లాడారు.
ఇక రోహిణితో రఘువరన్ వివాహం 1996లో జరిగింది. వారిద్దరికీ రిషివరన్ అనే కుమారుడు ఉన్నాడు. అయితే రఘువరన్ విపరీతంగా మద్యానికి బానిస కావడంతో వీరిద్దరూ 2004లో విడిపోయారు. రఘువరన్ తాగడు ముందు తాను.. తన కొడుకు ఓడిపోయామని కూడా రోహిణి అప్పట్లో చెప్పారు. ఇక రఘువరన్ బ్రతికి ఉండగా ఎంతో ఇష్టంగా కంపోజ్ చేసి పాడిన ఆరు పాటలను ఆయన మరణం తర్వాత ఒక ఆల్బమ్గా రిలీజ్ చేశారు. రజనీకాంత్ చేతుల మీదగా విడుదలైన ఈ ఆల్బమ్‌ను ఆయన భార్య రోషిణి, తనయుడు రిషి అందుకున్నారు.