కే జి ఎఫ్ సిరీస్ సినిమాల తర్వాత దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న యాక్షన్ థ్రిల్లర్ సలార్. టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన సలార్ పార్ట్ వన్ కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ సినిమా టీజర్ అంచనాలు పెంచేయగా. తాజాగా దీనికి సంబంధించిన ఒక వార్త అంచనాలు రెట్టింపు చేసేలా ఉంది.
ప్రభాస్ అభిమాని ఒకరు సలార్ షూటింగ్‌లో తాను చూసిన విషయాలను మీడియాకు వివరించారు. ఆ వీడియోలో ప్రభాస్ అభిమాని మాట్లాడుతూ నీల్ చిన్న సన్నివేశాన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి బాగా వచ్చేవరకు ఎక్కడ రాజీపడటం లేదని సినిమాలో ఓ యాక్షన్ సన్నివేశం కోసం ప్రభాస్ ఎంతో కష్టపడినట్టు చెప్పాడు. ఈ యాక్షన్ సన్నివేశంలో ప్రభాస్ ఏకంగా వెయ్యి మందితో ఫైట్ చేస్తాడని అదే సమయంలో మరో పాత్రలో ఉన్న ప్రభాస్ఎంటర్ కూడా ఉంటుందని ఈ సన్నివేశం షూటింగ్ చూసి తను ఆశ్చర్యపోయినట్టు ఆ అభిమాని చెప్పాడు.
దీంతో ఈ సీన్ ను తాను స్క్రీన్ పై ఎప్పుడు చూస్తానా.. అని ఎంతో ఆసక్తితో ఉన్నట్టు కూడా చెప్పాడు. ఇక ఈ సినిమా నిర్మాత విజయ్ కిర్‌గంధూర్‌కు కూడా గతంలో ఒక మీడియా సంస్థతో సలార్ క్లైమాక్స్ గురించి చాలా అదిరిపోతుందని మాట్లాడిన సంగతి తెలిసిందే. సినిమా క్లైమాక్స్ సీన్లు చాలా అద్భుతంగా ఉంటాయని కచ్చితంగా అవి ఇండియన్ సినిమా హిస్టరీలో ఒక బెంచ్ మార్క్ క్రియేట్ చేస్తాయని గతంలో విజయ్ చెప్పిన విషయం తెలిసిందే. ప్రభాస్ కు జోడిగా శృతిహాసన్ నటిస్తున్న ఈ సినిమా మొదటి భాగం షూటింగ్ పూర్తిచేసుకుంది.
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. సెప్టెంబర్ 28న పాన్ ఇండియా లెవెల్ లో ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. జగపతిబాబు, ఈశ్వరి రావు, పృథ్వీరాజ్ వంటి అగ్ర నటులు కీలక పాత్రలలో కనిపిస్తున్నారు. బాహుబలి సినిమాల తర్వాత ప్రభాస్ నటించిన సినిమాల సరైన అంచనాలు అందుకోవటం లేదు. ఈ క్రమంలోనే సలార్ ప్రభాస్ అభిమానుల కొరత తీర్చేస్తుందని ఆశపడుతున్నారు.