ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది . టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా ట్రోలింగ్ కి గురయ్యే మెగా ఫ్యామిలీ ఈ మధ్యకాలంలో మరింత ట్రోలింగ్ కి గురవుతుంది. దానికి కారణాలు ఏంటి అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మెగా ఫ్యామిలీలో జరిగే పనులే అంటూ కూడా మనం అర్థం చేసుకోవచ్చు . కాగా రీసెంట్గా నిహారిక భర్తతో విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే . జొన్నలగడ్డ చైతన్యతో వివాహం జరిగిన రెండేళ్లకే నిహారిక భర్త జొన్నలగడ్డ చైతన్య నుంచి విడాకులు తీసుకుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ నిహారిక చాలా హర్ట్ అయింది అని మాత్రం బాగా అర్థమవుతుంది .
ఆ తర్వాత మెగా ఫ్యామిలీలో చాలా గుడ్ న్యూస్ లు విన్నా.. ఇప్పటికి నిహారిక డివర్స్ కారణంగానే మెగా ఫ్యామిలీ ట్రోల్ చేస్తున్నారు. కాగా ఇలాంటి క్రమంలోనే త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠిలపై ఓ దారుణమైన న్యూస్ వైరల్ గా మారింది . రీసెంట్గా వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి నిశ్చితార్థం చేసుకున్నారు . నవంబర్ ఒకటవ తేదీన గ్రాండ్గా ఇటలీలో వెడ్డింగ్ ప్లాన్ చేసుకున్నారు. పెళ్లి పనుల్లో చురుగ్గా పాల్గొంటున్న ఈ జంటకు అభిమానుల నుండి షాకింగ్ ప్రశ్నలు ఎదురవుతున్నాయి .
రీసెంట్గా వరుణ్ తేజ్ నటించిన గాంధీవదారి అర్జున సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది అనుకుంటే ఫ్లాప్ అయింది . దీంతో ఈ ఫ్లాప్ ని మొత్తం తీసుకెళ్లి లావణ్య త్రిపాథి పై పెట్టేశారు. ఆమె ఐరెన్ లెగ్ అని.. ఇంతవరకు ఆమె సినిమాల్లో సక్సెస్ కొట్టిందే లేదని .. ఆమెను మీ ఇంటికి కోడలుగా చేసుకుంటే ఇంకా నెగటివ్స్ వస్తాయని.. అందుకే ఆ ఆలోచన నుండి విరమించుకోమని వరుణ్ తేజ్ కు సలహాలు ఇస్తున్నారు. దీంతో మెగా ఫ్యామిలీలో మరో కొత్త ప్రాబ్లం ఎదురయింది.
మెగా ఫ్యామిలీ కంటే ఇలాంటి ట్రోలింగ్ కొత్తే కానీ లావణ్య త్రిపాథి ఫ్యామిలీ చాలా పద్ధతి గలది . సొసైటీలో పేరు ప్రతిష్టలు ఉన్నవి .. ఇలా తమ కూతురిని ట్రోల్ చేస్తూ ఉండేసరికి లావణ్య పేరెంట్స్ భరించలేకపోతున్నారట . దీనిపై మెగా ఫ్యామిలీ ఏదో ఒక నిర్ణయం తీసుకోకపోతే వాళ్లు ఎంతటి నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారట. దీంతో ఇదే న్యూస్ ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. మొత్తానికి గాండీవ దారి అర్జున సినిమా వరుణ్ తేజ్ కు కెరియర్ పరంగానే కాదు పర్సనల్ లైఫ్ పరంగా కూడా ఇబ్బందులకు తెచ్చిపెట్టింది..!!