సినిమా పరిశ్రమలో సర్దుకుపోవటం ( కాస్టింగ్ కౌచ్ ) అనే పదం ఇటీవల మళ్ళీ ఎక్కువగా వినిపిస్తోంది. తాజాగా పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి హీరోయిన్ అను ఇమాన్యుఎల్ కూడా తన కెరీర్‌లో తాను అలాంటి సంఘటనలు ఎదుర్కోవాల్సి వచ్చిందని పేర్కొంది. చదువుకునే రోజుల్లోనే బాలినటిగా సినీరంగ ప్రవేశం చేసింది ఈ మలయాళ బ్యూటీ. ఆ తర్వాత 2016లో నిఫిన్ బాలికి జంటగా యాక్షన్ హీరో బీజు అనే మలయాళ సినిమాతో ఆమె హీరోయిన్గా పరిచయం అయింది.
అదే ఏడాది ఆమె తెలుగులో నాని హీరోగా వచ్చిన మజ్ను సినిమాలో కిరణమై పాత్రలో మెప్పించింది. ఆ తర్వాత కోలీవుడ్ హీరో శివ కార్తికేయన్ సరసన ఓ సినిమాలో హీరోయిన్గా నటించింది. ఈ సినిమా తర్వాత కోలీవుడ్లో మరిన్ని అవకాశాలు వస్తాయని ఆశలు పెట్టుకుం.ది ఆ సినిమా విజయాన్ని సాధించిన అనూను మాత్రం తమిళ సినీ జనాలు.. దర్శక నిర్మాతలు అస్సలు పట్టించుకోలేదు. దీంతో తెలుగు సినిమా పరిశ్రమపై ఫోకస్ పెట్టింది.
ఇక్కడ స్టార్ హీరోలతో నటించే అవకాశాలు కూడా వచ్చా యి. పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి – బన్నీ నా పేరు సూర్య – గీతగోవిందం వంటి సినిమాలు చేసిన ఈ అమ్మడిని స్టార్ ఇమేజ్ వరించలేదని చెప్పాలి. పవన్ – బన్నీ లాంటి హీరోల పక్కన హీరోయిన్గా చేసినా కూడా ఆమెకు మినిమం రేంజ్ హీరోయిన్గా కూడా గుర్తింపు రాకపోవడం దురదృష్టకరం. తాజాగా అను తమిళ హీరో కార్తీకి జంటగా జపాన్ సినిమాలో నటించింది త్వరలోనే ఈ సినిమా రిలీజ్ కానుంది ఈ సినిమాపై అను చాలా అసలు పెట్టుకుంది.
కాగా ఇటీవల ఇంటర్వ్యూలో సర్దుకుపోవటం అంశంపై స్పందిస్తూ తనకు అలాంటి అనుభవాలు ఎదురయ్యాయి అని చెప్పింది. ఇలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు కుటుంబ సభ్యుల అండతో ఎదుర్కొన్నానని చెప్పింది. ఇలాంటి సందర్భాల్లో మనం సమస్యను ఒంటరిగా కాకుండా కుటుంబ సభ్యుల అండతో ఎదుర్కోవటం మంచిదని అను కుండ బద్దలు కొట్టేసింది. ఏది ఏమైనా అను మాటలు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ వేధింపులు ఎదుర్కొనే ఎంతోమంది అమ్మాయిలకు మరో ధైర్యాన్ని ఇచ్చాయని చెప్పాలి.