సినిమా ఇండస్ట్రీలో మహిళలు ప్రధానంగా ఎదుర్కొనే సమస్య క్యాస్టింగ్ కౌచ్. నీకు ఛాన్స్ ఇస్తాం.. సరే మరి నువ్వు మాకు ఏమీ ఇస్తావు కాంప్రమైజ్ కాకపోతే నీకు అవకాశాలు రావు ఇలా ఎన్నో సమస్యలు మహిళలు ఎదుర్కొంటూ ఉంటారు. ఇప్పుడు స్టార్ హీరోయిన్గా ఉన్న ఎంతోమంది ఇలాంటి అడ్డంకులు దాటుకుని ముందుకు వచ్చిన వాళ్లే. ఇలాంటి వారిలోనే బుల్లితెర నటి రేష్మ ప్రసాద్ కూడా ఒకరు. తాజాగా ఆమె క్యాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడింది.
సినిమాల్లోనే కాకుండా చేరికలు కాంప్రమైజ్ అడుగుతారని చెప్పుకొచ్చింది. ఇండస్ట్రీలో అడ్జస్ట్మెంట్ అనేది చాలా కామన్ అయిపోయింది. గదిలోకి రావడానికి అడ్జస్ట్ అవుతావా ? అని చాలా సింపుల్గా అడిగేస్తారు. కొన్ని అప్లికేషన్ ఫామ్స్ లో అయితే అడ్జస్ట్మెంట్‌కు ఒప్పుకుంటావా ? అని ప్రత్యేకంగా ఓ కాలం కూడా ఉంటుంది.. ప్రధాన పాత్రలకే కాదు.. సైడ్ క్యారెక్టర్లు అసలు గుర్తింపు లేని చిన్నారి చితకా పాత్రలకు కూడా కాంప్రమైజ్ అడుగుతున్నారట.
ఈ మహమ్మారి వల్ల నిజమైన ప్రతిభావంతుడు సినిమా రంగంలోకి రావడానికి భయపడుతున్నారని ఆమె వాపోయింది. అప్లికేషన్ ఫామ్ లో అడ్జస్ట్మెంట్‌కు ఒప్పుకోవటం లేదని రాసిన మళ్లీ అదే టాపిక్ తీసుకువచ్చి ఒత్తిడి చేస్తారని… మంచి పాత్ర కోసం మంచి ఫేమ్ కోసం కన్న కలలు సహకారం చేసుకోవడం కోసం ఆ ఒత్తిడికి లొంగిపోతాం అని ఆమె తెలిపింది.
గతంలో తాను కూడా ఓసారి ఒత్తిడి తట్టుకోలేక నా కెరీర్ కోసం అడ్జస్ట్మెంట్‌కు ఒప్పుకున్నానని.. ఈ విషయంపై తాను ఎందుకు ఓపెన్ అవుతున్నాను అంటే ఇండస్ట్రీలో వాస్తవంగా ఏం జరుగుతుందో ?అందరికీ తెలియాలన్న ఉద్దేశంతో ఈ విషయాన్ని బయటపెట్టినట్టు రేష్మ చెప్పింది.