టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ హీరోగా… స్టార్ హీరోయిన్ సమంత హీరోయిన్ గా శివా నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన లేటెస్ట్ లవ్, యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైనర్ ఖుషి. టాలీవుడ్‌లో ఎప్పుడో 22 సంవత్సరాల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – భూమిక జంటగా కోలీవుడ్ దర్శకుడు ఎస్‌జె. సూర్య దర్శకత్వంలో వచ్చిన సూపర్ హిట్ ఖుషి టైటిల్‌తోనే ఈ సినిమా కూడా వస్తోంది.
పాన్ ఇండియా రేంజ్‌లో తెరకెక్కిన ఈ సినిమాను మూవీని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా హేషం అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందిస్తున్నారు. మొదటి నుంచి ఖుషి సినిమాపై అటు సినీ అభిమానులతో పాటు ఇటు ట్రేడ్ వర్గాల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఖుషి మూవీ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్, ట్రైలర్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇక ఈ సినిమా సెప్టెంబర్ 1న పలు భాషల ఆడియన్స్ ముందుకి వస్తోంది.
మరో వైపు ఖుషి ప్రమోషన్స్ ఫుల్ స్వింగ్ లో జరుగుతుండగా తాజాగా ఈ మూవీ సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమా యు / ఏ సర్టిఫికెట్ పొందగా… సినిమా అఫీషియల్ రన్ టైం 2.45 గంటలుగా లాక్ అయింది. ఒకరకంగా ఇది లెంగ్తీ రన్ టైం అనే చెప్పాలి. అంటే 165 నిమిషాల పాటు సినిమా ఉండనుంది.
అయితే సినిమా ఎంత సాగదీసినట్టుగా ఉన్నా విజయ్ – సామ్ కెమిస్ట్రీ , లవ్ సీన్లు వర్కవుట్ అవ్వడంతో పాటు ఈ జంట వెండితెర మీద మ్యాజిక్ చేస్తే ఆ రన్ టైం పెద్ద ఎక్కువ కాదు. ఏదేమైనా రిలీజ్‌కు ముందే మంచి హైప్ తెచ్చుకున్న ఖుషి మూవీ రిలీజ్ తరువాత ఎలాంటి హిట్ కొడుతుందో ? చూడాలి.