Moviesనాగచైతన్యతో కీర్తి సురేష్.. క్రేజీ కాంబోని సెట్ చేసిన హిట్ డైరెక్టర్...

నాగచైతన్యతో కీర్తి సురేష్.. క్రేజీ కాంబోని సెట్ చేసిన హిట్ డైరెక్టర్ ఎవరంటే..!

మహానటిగా పాపులారిటీ సంపాదించుకున్న అందాల ముద్దుగుమ్మ కీర్తి సురేష్ నాగచైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుందా..? అంటే అవునని అంటున్నారు సినీ ప్రముఖులు. ఇప్పటికే భోళాశంకర్ సినిమాతో డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్న కీర్తి సురేష్ మరోసారి తన లక్ ని పరీక్షించుకోబోతుంది . ఈ క్రమంలోనే అక్కినేని నాగచైతన్య ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని చందు మొండేటి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో సెకండ్ హీరోయిన్ గా సెలెక్ట్ అయింది .

ఈ సినిమా మొత్తం జాలర్లు జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే . రీసెంట్గా నాగచైతన్య అలాంటి వాళ్లతో లైవ్ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుని మరీ ఒరిజినల్ ఎక్స్పీరియన్స్ని గెయిన్ చేసుకున్నాడు. కాగా ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఉన్నారు అంటూ ప్రచారం జరుగుతుంది . మొదటి హీరోయిన్గా సాయి పల్లవి.. రెండో హీరోయిన్గా కీర్తి సురేష్ ఈ సినిమాలో కలిసికనిపించబోతున్నారట .

ఆల్రెడీ సాయి పల్లవి నాగచైతన్యతో లవ్ స్టోరీ అనే సినిమాలో నటించి మెప్పించింది. కీర్తి సురేష్ ఫస్ట్ టైం నాగచైతన్యతో స్క్రీన్ షేర్ చేసుకోబోతుంది. దీంతో సోషల్ మీడియాలో ఈ న్యూస్ వైరల్ గా మారింది. చూడాలి మరి ఈ కాంబో ఏ విధంగా మెప్పిస్తుందో..? మహానటి సినిమా కొంచెం సెపే వీళ్లు తెర పైంకనిపించారు..ఫుల్ లెంత్ లో కలిసి నటిస్తే ఎలా ఉంటుందో..?చూడాలి..!!

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news