మామూలుగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ అంటే టాలీవుడ్ లో ఎలాంటి క్రేజ్ ఉంటుందో తెలిసిందే. త్రివిక్రమ్ సినిమా వస్తుందంటే చాలు హీరోలతో సంబంధం లేకుండా థియేటర్ల దగ్గర జనాలు పోటెత్తుతారు. స్టార్ హీరోలకు మించిన క్రేజ్ త్రివిక్రమ్ సొంతం. అసలు హీరో ఎవరన్న విషయంతో సంబంధం లేకుండా త్రివిక్రమ్ సినిమాలకు భారీ బిజినెస్ జరుగుతుంది.
అంత ఎందుకు నితిన్‌తో అ.. ఆ సినిమా చేస్తే 50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది అంటే అది కేవలం త్రివిక్రమ్‌ను చూసి మాత్రమే. అయితే ఇదంతా గతం.. త్రివిక్రమ్ డైరెక్టర్ చేసిన అలవైకుంఠపురంలో సినిమా వచ్చి కూడా మూడేళ్లు అవుతోంది. ఆ ఫామ్ అలా కంటిన్యూ చేయలేకపోయాడు. ఇక ఇప్పుడు తాను సినిమాలు డైరెక్ట్ చేయడం వదిలేసి.. పవన్ సినిమాలకు కథలు, స్క్రీన్ ప్లేలు, డైరెక్టర్లను సెట్ చేసే పనిలో బిజీగా ఉన్నాడు.
ఇందుకోసం తన వాటాగా బాగానే తీసుకుంటున్నాడు. డైరెక్షన్ చేయడం కంటే ఇదే బాగున్నట్టు ఉంది మనోడికి. ఇక పవన్ వకీల్‌సాబ్, భీమ్లానాయక్, ఇప్పుడు బ్రో సినిమాలు సెట్ చేసింది.. తెరవెనక అంతా తానై నడిపిస్తోంది కూడా త్రివిక్రమే. అయితే బ్రో సినిమా విషయంలో త్రివిక్రమ్ పొలిటికల్గా కూడా బాగా టార్గెట్ అయిపోయాడు. త్రివిక్రమ్‌పై ఏపీలో అధికార వైసీపీ వాళ్లు బాగా మండిపడుతున్నారు.
ప్రస్తుతం త్రివిక్రమ్ మహేష్‌బాబుతో గుంటూరు కారం సినిమా చేస్తున్నాడు. ఇది వచ్చే సంక్రాంతికి అంటున్నారు. మహేష్ రాజకీయాలకు పూర్తి దూరంగా ఉంటాడు. అయితే ఎంతైనా త్రివిక్రమ్ డైరెక్టర్ అన్న ముద్ర ఉండడంతో ఈ సినిమాకు ఏపీలో టిక్కెట్ రేట్లు, అదనపు షోల విషయంలో ఇబ్బందులు ఉండొచ్చు. సినిమాకు యునానమస్ హిట్ టాక్ వస్తే ఇబ్బంది ఉండదు.. లేకపోతే గుంటూరు కారం కూడా బ్రో లాగానే ఇబ్బందులు ఫేస్ చేయాల్సి రావచ్చు.
అందుకే ఇప్పుడు త్రివిక్రమ్‌తో సినిమా అంటేనే టాలీవుడ్ స్టార్ హీరోలు, దర్శక నిర్మాతలు సైతం కాస్త ముందు వెనుకా ఆలోచించే పరిస్థితి వచ్చేసిందని ఇండస్ట్రీ జనాలు గుసగుసలాడుకుంటున్నారు.