సెప్టెంబర్ లో వరుసగా అన్ని క్రేజీ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అయితే క్రేజ్ గా బాప్ మాత్రం సలార్ ఒక్కటే. ప్రభాస్ – ప్రశాంతం నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ హైవోల్టేజ్ యాక్షన్ సినిమా సెప్టెంబర్ 28న థియేటర్లలోకి వస్తోంది. అంటే నెలరోజుల సమయం కూడా లేదు. విచిత్రం ఏంటంటే ఈ సినిమా బిజినెస్ ఇంకా క్లోజ్ కాలేదు. ప్రభాస్ సినిమా అందులోనూ కే జి ఎఫ్ సిరీస్ సినిమాలతో నేషనల్ వైడ్‌గా దుమ్ము రేపిన ప్రశాంత నీల్ దర్శకుడు.
మరి ఇలాంటి క్రేజీ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి ఇంకా బిజినెస్ క్లోజ్ కాకపోవడం అందరిని ఆశ్చర్యానికి గురిచేస్తుంది. అయితే కేవలం ఈ సినిమా నిర్మాణ సంస్థ హోంబలే ప్రొడక్షన్స్ వాళ్ళ అత్యాశ వల్ల ఈ పరిస్థితి వచ్చినట్టు తెలుస్తోంది. సినిమాపై అతి నమ్మకంతో అత్యాశకు పోయి అన్ని ఏరియాలలోను భారీ రేట్లు చెబుతున్నారు. నైజాంలో ఈ సినిమాని కొనడానికి గట్టి పోటీ ఉంది. దిల్ రాజు – ఏషియన్ సునీల్ పోటీకి దిగారు. అయితే నైజాం కోసం ఏకంగా 70 కోట్లు అడుగుతున్నారు. ఇది కనివినీ ఎరుగని రేటు.
ఆది పురుష్ సినిమా రు. 35 కోట్లు మాత్రమే రాబట్టింది. సలార్ ఏ మాత్రం తేడా కొట్టిన ఆస్తులు అమ్మేసుకోవాలి. ఇక సిడెడ్‌లో కూడా రికార్డు రేటు చెబుతున్నారు. అన్ని ఏరియాలలోను ఇదే పరిస్థితి ఉంది. ఇటీవల కాలంలో వరుసగా పెద్ద సినిమాలు డిజాస్టర్లు అవడంతో బయ్యర్లకు గట్టి షాకులు తగిలాయి. ఎంత క్రేజ్ ఉన్న సినిమా అయినా ఆచితూచి స్పందిస్తున్నారు. అందుకే సలార్ విషయంలో రిస్క్ చేయడానికి ఎవరు ? ఇష్టపడటం లేదు.
ఒకవేళ ఎవరు ఈ సినిమాను కొనేందుకు ముందుకు రాకపోతే హోంబలే వాళ్లే కేజిఎఫ్ లా ఈ సినిమాని సొంతంగా రిలీజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సలార్ ఇండియాలోనే భారీ బడ్జెట్ సినిమాలలో ఒకటి. ఇలాంటి సినిమాను వీలైనంతవరకు అమ్ముకొని సేఫ్ అవ్వాలని చూస్తారు నిర్మాతలు. కానీ హోం బలే వాళ్లు అత్యాశకు పోవడంతో ఇక్కడ సీన్ రివర్స్ అవుతోంది. అత్యాశకు పోయి ఎక్కువ రేట్లు చెప్పుతుండడంతో ఎవ్వరు సలార్ సినిమా కొనేందుకు ముందుకు రావడం లేదు. తేడా వస్తే హోంబలే వాళ్ళకి గట్టి షాక్ తప్పదని ట్రేడ్ వర్గాలు చర్చించుకుంటున్నాయి.