పదేళ్లకు పైగా సినిమాలకు దూరంగా ఉన్న చిరంజీవి ఖైదీ నెంబర్ 150 సినిమాతో రీ ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తమిళంలో విజయ్ నటించిన కత్తి సినిమాకు రీమేక్‌గా తెరకెక్కినా చిరంజీవి చరిష్మాతో పాటు ఆయన డ్యాన్సులు పదేళ్ల తర్వాత రీఎంట్రీ ఇవ్వడంతో బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కేసింది. ఆ తర్వాత చిరంజీవి వరుసపెట్టి సినిమాలు చేస్తున్నా అన్ని బాక్సాఫీస్ దగ్గర బాల్చి తన్నేస్తున్నాయి.
అయితే సంక్రాంతికి వచ్చిన వాల్తేరు వీరయ్య సినిమా హిట్ అయింది అని సంతోషపడే లోపలే భోళాశంకర్ సినిమా అతిపెద్ద డిజాస్టర్ అయ్యింది. చిరంజీవి రీ ఎంట్రీ ఇచ్చాక ఎక్కువగా రీమేక్ సినిమాలు చేసుకుంటూ వెళుతున్నారు. ఇది కూడా ఆయన వరుస ప్లాప్‌లకు ప్రధాన కారణం. ఇదిలా ఉంటే చిరంజీవి సినిమాలకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా ఆయన పెద్ద కుమార్తె సుస్మిత కొణిదెల వ్యవహరిస్తున్నారు.
అయితే ఆమె చేసిన కాస్ట్యూమ్స్ అన్నీ చిరంజీవికి ఏ మాత్రం సూట్ కావటం లేదని.. చిరంజీవిని వాటిలో అస్సలు చూడలేకపోతున్నాం అన్న విమర్శలు అయితే ఉన్నాయి. సైరా, గాడ్ ఫాదర్, ఆచార్య తాజాగా భోళా శంకర్ సినిమాలకు సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరించారు. ఈ సినిమాలు అన్ని డిజాస్టర్లు అయ్యాయి. తాజాగా వచ్చిన భోళాశంకర్ సినిమాలో పాటల్లో చిరంజీవి కాస్ట్యూమ్స్ అస్సలు చూడలేని పరిస్థితి.. ఈ కాస్ట్యూమ్స్ చాలా దారుణంగా ఉన్నాయి అన్న ట్రోలింగ్ కూడా నడిచింది.
అలాంటిది ఇప్పుడు సుస్మిత ఏకంగా నిర్మాతగా మారి చిరంజీవితో సినిమా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. పైగా ఇది కూడా మలయాళ హిట్ సినిమా బ్రో డాడికి రీమేక్ అంటున్నారు. కురసాల కళ్యాణ్ కృష్ణ దర్శకుడు. చిరంజీవి పాలిట ఇప్పటికే ఐరన్ లెగ్ ముద్ర వేసుకున్న కుమార్తె సుస్మిత నిర్మాతగా చిరు సినిమా. ఇది కూడా రీమిక్ అంటే ఈ బ్యాడ్ సెంటిమెంట్ వరుసగా రిపీట్ అయితే ఈ సినిమా కూడా అట్టర్ ప్లాప్ అవుతుందని..దయచేసి చిరంజీవి డైరెక్ట్ కథలు తీసుకుని బయట నిర్మాతలతో సినిమాలు చేయాలని అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.